ఇండియా టీవీ-సి‌ఎన్‌ఎక్స్ సర్వే…ఏపీలో ఎవరికి మెజారిటీ ఉందంటే…?

Share Icons:

అమరావతి, 11 మార్చి:

సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం సాయంత్రం నోటిఫికేషన్ వెలువరించిన సంగతి తెలిసిందే. 543 లోక్‌సభ స్థానాలకి 7 విడతల్లో జరిగే ఈ ఎన్నికలు ఫలితాలు మే 23న విడుదల కానున్నాయి. ఏప్రిల్11, 18, 23, 29, మే 6, 12, 19న ఇలా 7 సార్లుగా లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి.

ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి విడత ఏప్రిల్ 11న పోలింగ్ జరగనుంది. అలాగే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా 11 నే జరగనున్నాయి.

ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన క్రమంలో ఏపీలో జనం నాడి ఎటువైపు ఉందో అనే దానిపై ఇండియా టీవీ-సి‌ఎన్‌ఎక్స్ ఒపీనియన్ పోల్స్ ద్వారా ఒక సర్వే బయటకొచ్చింది.  ఈ సర్వేలో రాష్ట్రంలోని మొత్తం 25 స్థానాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ 22 చోట్ల, టీడీపీ 3 స్ధానాల్లో విజయం సాధిస్తుందని తేలింది.

ఇక దేశవ్యాప్తంగా చూస్తే ప్రభుత్వ ఏర్పాటుకు 272 మేజిక్ ఫిగర్ కాగా, బీజేపీ సొంతంగా 238 చోట్ల, ఎన్డీయే కూటమి 285 స్ధానాల్లో గెలుపొందుతుందని సర్వే పేర్కొంది. అటు గత సార్వత్రిక ఎన్నికల్లో 80 స్థానాలకే పరిమితమైన యూపీఏ ఈసారి తన బలాన్ని 126 సీట్లకు పెంచుకునే అవకాశాలున్నట్లు తెలిపింది. అలాగే తెలంగాణలో అధికార టీఆర్ఎస్ 14, కాంగ్రెస్ 2, ఎంఐఎం 1 చోట గెలుస్తాయని పేర్కొంది.

మామాట: మొత్తానికి ఏపీలో జగన్ హవా గట్టిగా ఉంది…

Leave a Reply