Header Banner
Header Banner
TRENDING NOW

రాహుల్ గాంధీకే పట్టం కడతామంటున్న ఎస్సీలు, ముస్లింలు

రాహుల్ గాంధీకే పట్టం కడతామంటున్న ఎస్సీలు, ముస్లింలు

ఢిల్లీ, 11 మార్చి:

ఎన్నికల శంఖారావం పూరించనున్న నేపధ్యంలో జాతీయ స్థాయిలో రాజకీయం మరింత వేడెక్కింది. రోజురోజుకీ ప్రజాభిప్రాయాలు మారుతున్నాయి. గతంలో కంటే ముస్లింలు, ఎస్సీలలో రాహుల్ గాంధీకి  జనాదరణ ఎక్కువైపోయింది.

“ప్రధానిగా ఎవరిని కోరుకుంటున్నారు?” అని ఇండియా టుడే నిర్వహించిన పీఎస్ఈ (పొలిటికల్ స్టాక్ ఎక్స్ఛేంజ్) సర్వేలో ఎస్సీలు, ముస్లింలు రాహుల్ గాంధీనే ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు.

GCR Infra AD, Maamaata, SEO, Primepagesinfo,
Life Homepathy
treefurn AD

గత జనవరిలో నిర్వహించిన సర్వేతో పోలిస్తే ఇప్పటి సర్వేలో తేలిన విషయం ఏంటంటే రాహుల్ కి ఉన్న జన బలం ప్రధాని నరేంద్రమోడీని మించిపోయింది.

41శాతం మంది ఎస్సీలు నరేంద్ర మోడీకి మద్దతు ఇవ్వగా 44 శాతం మంది రాహుల్ గాంధీనే ప్రధాని కావాలని కోరారు.

ఇక ముస్లింల విషయానికి వస్తే కేవలం 18 శాతం మంది మాత్రమే మోడీకి మద్దతు ఇవ్వగా అత్యధికంగా 61శాతం మంది ముస్లింలు రాహుల్ కే పట్టం కట్టాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు.

అయితే గత జనవరిలో నిర్వహించిన సర్వేతో పోలిస్తే తాజా సర్వేలో రాహుల్ పాప్యులారిటీ 4 శాతం పెరిగగా.., మోదీ పాప్యులారిటీ మాత్రం కేవలం ఒక శాతమే పెరిగింది.

ఇక అన్ని సామాజికవర్గాల ప్రకారం చూస్తే మాత్రం ఎక్కువ శాతం ప్రజలు మళ్ళీ మోడీకే పట్టం కట్టాలని నిర్ణయించుకున్నారు. రాహుల్ కి 33 శాతం మంది మద్దతు ఇస్తుండగా 51 శాతం మళ్ళీ మోడీనే రావాలని కోరుకుంటున్నారు.

మామాట: ఇంకో నెల ఆగితే తేలిపోతుందిగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: