రూ.7వేల కోట్లతో జపాన్ నుంచి 18 బుల్లెట్ రైళ్లకొనగోలు..?

Share Icons:

కొత్త ఢిల్లీ, సెప్టెంబర్ 05,

జపాన్ దేశం నుంచి రూ. 7వేల కోట్ల విలువైన 18 బుల్లెట్ రైళ్లను కొనగోలు చేయడానికి భారత్ సిద్దమౌతోంది. ఇందులో సాంకేతిక పరిజ్ఞానం బదలీ కూడా అంతర్బాగంగా ఉంటుందని అధికారులు తెలిపారు.

కాగా దేశంలోనే తొలి బుల్లెట్ రైలు ముంబై-అహ్మదాబాద్ మధ్య 2022 నాటికి పరుగుతీయనుంది. ఈ రెండు నగరాల మధ్యదూరం 508 కిమీ పొడవునా హైస్పీడ్ రైల్ ట్రాక్ ను జపాన్ సహకారంతో నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జపాన్ నుంచి 18 సినకసన్ రైళ్లను దిగుమతి చేసుకుంటున్నట్టు అధికారలు తెలిపారు. ఒక్కో రైలులో 10 బోగీలుంటాయి, ఈ రైళ్లు గంటకు 350 కిమీ వేగంతో ప్రయాణిస్తాయని తెలిపారు. జపాన్ హై స్పీడ్ రైళ్లు అత్యున్నత భద్రతా ప్రమాణాలు కల్గినవనీ, వీటిలో ముంబై-అహ్మదాబాద్ మధ్య రూ. 3000వేలకే ఎకానమీ క్లాస్ లో ప్రయాణించవచ్చునని తెలిపారు. ఇక మొదటి తరగతి బోగీలలో విమానాలలో ఉండే అన్ని వసతులూ అందుబాటులో ఉంటాయన్నారు. ఈ మేరకు త్వరలో టెండర్లు పిలవనున్నట్టు భారత రైల్వేఅధికారులు తెలిపారు.

మామాట : ప్రగతి సరే… మరి ఆకలి చావుల సంగతో…

Leave a Reply