మిడిలార్డర్ రాణించాల్సిందే….టెస్ట్ తరహాలో ధోనీ బ్యాటింగ్

Share Icons:

 

లండన్, 25 జూన్:

ప్రపంచకప్‌ మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. అంతా అనుకున్నట్లే పెద్ద జట్లే సెమీస్‌కి వెళ్ళే అవకాశం ఉంది. ప్రస్తుతానికి న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఇండియా, ఇంగ్లండ్‌లు టాప్‌లో కొనసాగుతున్నాయి.

అయితే 5 మ్యాచ్‌లు ఆడి నాలుగింట్లో గెలిచి, ఒకటి టై చేసుకున్న భారత్…మరో నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అయితే గడిచిన మ్యాచ్‌ల్లో భారత్ టాప్ ఆర్డర్ రాణిస్తున్న…మిడిలార్డర్‌ బ్యాటింగ్‌ పరిస్థితిమాత్రం ఆందోళన కలిగిస్తోంది.

దానికి కారణం నాలుగు, ఐదు స్థానాల్లో ఆడే బ్యాట్స్‌మెన్‌. రాహుల్‌ ఓపెనింగ్‌కి వెళ్లడంతో చక్కటి అవకాశం దక్కిన విజయ్‌శంకర్‌ తన బ్యాటింగ్‌తో ఆకట్టుకోలేకపోతున్నాడు. మరోవైపు వికెట్‌కీపర్‌ ధోనీ సైతం మెగా టోర్నీలో తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. ముఖ్యంగా అఫ్గాన్‌తో మ్యాచ్‌లో 53.84 స్ట్రైక్‌రేట్‌తో ధోనీ(28;52 బంతుల్లో 3×4) పేలవ ప్రదర్శన చేశాడు.

అంతకుముందు దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో 34(46), ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో 27(14) పరుగులు చేసిన ధోనీ.. పాకిస్థాన్‌ మ్యాచ్‌లో ఒక్క పరుగుకే వెనుతిరిగాడు. అలాగే విజయ్‌శంకర్‌ పరుగులు తీసేందుకు ఇబ్బంది పడుతున్నాడు. కీలక సమయంలో నెమ్మదిగా ఆడుతున్నాడు. పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌లపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. అలాగే కేదార్ జాదవ్ కూడా పూర్తి ఫామ్‌లోకి రావాల్సి ఉంది. వీరు ముగ్గురు మిడిలార్డర్‌లో రాణిస్తే ప్రపంచకప్‌లో టీమిండియాకు ఎదురుండదు.

కాగా గతంలో ధోనీపై ఎన్ని విమర్శలు వచ్చినా ప్రతిసారి బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు. ఈ నేపథ్యంలో ఆఖరి ప్రపంచకప్‌ ఆడుతున్న మాజీ కెప్టెన్‌ నాకౌట్‌ చేరే దశలో తిరిగి ఫామ్‌లోకి రావాలని అభిమానులు ఆశిస్తున్నారు.

Leave a Reply