అదొక్కటే ఇండియా ఫైనల్ ఆశలు గండికొట్టిందా…!

India lost the World Cup 2019 semi-final to New Zealand by 18 runs in Old Trafford
Share Icons:

లండన్:

 

120 కోట్ల భారతీయుల ఆశలు అడియాసలయ్యాయి. ప్రపంచ కప్ గ్రూప్ దశలో తిరుగులేని విజయాలని సొంతం చేసుకున్న టీమిండియా సెమీస్ లో అడుగుపెట్టింది. అయితే సెమీస్ లో కూడా అదే ఊపుతో గెలిచి ఫైనల్ లో అడుగుపెడుతుంది అనుకున్నారు అంతా…కానీ ఊహించని రీతిలో న్యూజిలాండ్ టీమిండియాకి చెక్ పెట్టి ఫైనల్ లో అడుగుపెట్టింది.

 

మొదట న్యూజిలాండ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 239 పరుగులు చేసింది. టేలర్ (90 బంతుల్లో 74; 3 ఫోర్లు, 1 సిక్స్), విలియమ్సన్ (95 బంతుల్లో 67; 5 ఫోర్లు) అర్ధ శతకాలు సాధించారు. భారత బౌలర్లలో భువనేశ్వర్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ 49.3 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటైంది.

 

92 పరుగులకే 6 వికెట్లు కోల్పోయినా.. రవీంద్ర జడేజా (59 బంతుల్లో 77; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) అసమాన పోరాటానికి మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (72 బంతుల్లో 50; 1 ఫోర్, 1 సిక్స్) అండ తోడవడంతో ఒక దశలో ఆశలు చిగురించినా.. కీలక దశలో వీరిద్దరు వెనుదిరగడంతో పరాజయం తప్పలేదు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ హెన్రీ (3/37), బౌల్ట్ (2/42), శాంట్నర్ (2/34) రాణించారు. ఓడినా చివరి వరకు పోరాడిన కోహ్లీ కప్పు కల 2023 తర్వాత స్వదేశంలో జరిగే ప్రపంచకప్ వరకు కొనసాగాల్సిందే.

 

అయితే 14 బంతుల్లో 32 పరుగులు చేయాల్సిన సందర్భంలో భారీ షాట్‌కు యత్నించిన జడేజా ఔట్ కావడంతో భారత్‌కు భారీ దెబ్బ పడింది. విరాట్ సేన విజయానికి 12 బంతుల్లో 31 పరుగులు చేయాలి.. ఫెర్గూసన్ వేసిన 49వ ఓవర్ తొలి బంతికి ధోనీ సిక్సర్ బాదాడు. ఇంకే ముంది 11 బంతుల్లో 25 పరుగులే.. ధోని కొట్టేస్తాడు అనుకున్నారు. కానీ రెండో బంతికి పరుగులేమి చేయని ధోనీ మూడో బంతిని స్కైర్ లెగ్ వైపు పంపి రెండో రన్ పూర్తి చేయాలనుకున్నాడు. మొదటి పరుగు ముగించి తిరిగి క్రీజుకు చేరే క్రమంలో గప్టిల్ విసిరిన డైరెక్ట్ త్రో భారత్ ఆశలపై నీళ్లు కుమ్మరించింది. ఇదే మనకు ఫైనల్ ఆశలని గండికొట్టిందని చెప్పొచ్చు.

Leave a Reply