విజయయాత్రకి బ్రేక్ పడింది…ఆ తప్పిదాలే భారత్ కొంపముంచాయి…

Share Icons:

హామిల్టన్, 11 ఫిబ్రవరి:

వరుసగా ఆస్ట్రేలియాపై  టెస్ట్, వన్డే, న్యూజిలాండ్‌పై వన్డే సిరీస్‌లని గెలుచుకున్న టీమిండియా విజయ యాత్రకి బ్రేక్ పడింది. హామిల్టన్ వేదికగా నిన్న జరిగిన మూడో టీ20లో న్యూజిలాండ్ చేతిలో 4 పరుగుల తేడాతో ఓడి భారత్ 1-2 తేడాతో సిరీస్‌ని కోల్పోయింది.

మొదటి టీ20 మ్యాచ్‌ని భారీ తేడాతో ఓడిన..రెండో మ్యాచ్‌లో గెలిచి భారత్ సత్తా చాటి సిరీస్‌ని 1-1కి తీసుకొచ్చింది. అయితే మూడో మ్యాచ్‌ని తృటిలో చేజార్చుకుని సిరీస్‌ని కోల్పోయింది.

మూడో మ్యాచ్‌లో ఓడిపోవడానికి భారత్ చేసిన అనవసర తప్పిదాలే కారణమని తెలుస్తోంది. పూర్తి బ్యాటింగ్‌కి సహకరించే హామిల్టన్ పిచ్‌లో టాస్ గెలిచి రోహిత్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.  అసలు ఇలాంటి పిచ్‌లో ఎవరైనా మొదట బ్యాటింగ్ ఎంచుకుంటారు. కానీ డానీకి విరుద్ధంగా ఫీల్డింగ్ ఎంచుకుని భారీ మూల్యం చెల్లించుకున్నాడు. మొదట బ్యాటింగ్‌కి దిగిన కివీస్ బ్యాట్స్‌మెన్ చెలరేగి ఆడి 212 పరుగులు చేశారు. ఇక ఇదే కాక కీలక సమయంలో క్యాచ్‌లు వదలడం, మిస్ ఫీల్డింగ్‌తో అదనంగా పరుగులు సమర్పించుకున్నారు.

బౌలర్లలో ఒక కులదీప్ తప్ప మిగతా వారంతా లైన్ తప్పి బంతులు వేయడం వల్ల భారీగా పరుగులు ఇచ్చుకున్నారు. ఇక భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో బ్యాటింగ్‌లో కూడా కీలక సమయంలో వికెట్లు చేజార్చుకుని ఓటమి కొనితెచ్చుకున్నారు. మ్యాచ్ మనమే గెలుస్తాం అనే సమయంలో రోహిత్ కూడా వైడ్‌బాల్‌ని టచ్ చేసి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఇదే మ్యాచ్‌ని పూర్తిగా టర్న్ చేసింది. ఇలా అనేక తప్పిదాలు మ్యాచ్‌ని, సిరీస్‌ని భారత్‌కి దూరం చేశాయి.

మామాట: తప్పిదాల నుండే పాఠాలు నేర్చుకుంటారుగా  

 

Leave a Reply