దక్షిణాఫ్రికాకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన భారత్…

india-have-set-south-africa-a-target-of-395
Share Icons:

విశాఖపట్నం: విశాఖపట్నం వేదికగా జరుగుతున్న తొలి టెస్టు లో భారత్ తన రెండో ఇన్నింగ్స్ లో 323/4 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. దీంతో సౌతాఫ్రికాకు టీమ్‌ ఇండియా 395 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ రోహిత్‌ శర్మ(127: 149 బంతుల్లో 10ఫోర్లు, 7సిక్సర్లు) మెరుపు శతకం, టెస్టు స్పెషలిస్ట్‌ పుజారా(81: 148 బంతుల్లో 13ఫోర్తు, 2సిక్సర్లు) విజృంభించడంతో కోహ్లీసేన 67 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 323 పరుగులు చేసింది. రోహిత్‌, పుజారా జోడీ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా(40: 32 బంతుల్లో 3సిక్సర్లు), విరాట్‌ కోహ్లీ(31 నాటౌట్‌: 25 బంతుల్లో 3ఫోర్లు, సిక్స్‌), రహానె(27 నాటౌట్‌: 17 బంతుల్లో 4ఫోర్లు, సిక్స్‌) వన్డే తరహాలో బ్యాటింగ్‌ చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.

రెండున్నర సెషన్లకు పైగా ఆటలో పూర్తిగా ఆతిథ్య బ్యాట్స్‌మెన్‌ జోరు కొనసాగింది. ఓపెనర్ మాయాంక్ అగర్వాల్ 7 పరుగులకే ఔట్ అయిన..రోహిత్‌, పుజారా జోడీని విడగొట్టడంలో సఫారీ బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. స్పిన్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై సౌతాఫ్రికా స్పిన్నర్లు తేలిపోయారు. పూర్తి స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేసిన బ్యాటర్లు అలవోకగా ఫోర్లు, సిక్సర్లు బాది బౌలర్లపై ఒత్తిడి పెంచారు. సఫారీ బౌలర్లలో కేశవ్‌ మహరాజ్‌ రెండు వికెట్లు తీయగా.. రబాడ, ఫిలాండర్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు.

ఇక 395 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీ జట్టు ఓపెనర్ ఎల్గర్ వికెట్ కోల్పోయి 11 పరుగులు చేసింది. అశ్విన్ ఒక వికెట్ తీసుకున్నాడు. సఫారీలు ఇంకా 384 పరుగులు చేయాల్సి ఉంది. అయితే ఈరోజు సౌత్ ఆఫ్రికా తన మొదటి ఇన్నింగ్స్ 431 పరుగులకి ఆలౌట్ అయింది. అశ్విన్ 7 వికెట్లు తీసుకోగా, జడేజా 2, ఇషాంత్ ఒక వికెట్ తీసుకున్నారు. భారత్ తన తొలి ఇన్నింగ్స్ 502/7 పరుగులకు డిక్లేర్ చేసిన విషయం తెలిసిందే.

 

Leave a Reply