చివరి టెస్ట్ కు సిద్దంమైన క్రికెటర్లు

Share Icons:

 ది ఓవెల్, సెప్టెంబర్ 06,

టీం ఇండియాతో జరుగుతున్న ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ది ఓవెల్ వేదికగా జరుగనున్న ఐదో టెస్ట్ మ్యాచ్‌‌లో భారత్‌తో తలపడే ఇంగ్లండ్ జట్టు వివరాలను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. అయితే గాయం కారణంగా జట్టుకి దూరమైన జానీ బెయిర్‌స్టో ఈ టెస్టుతో తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నాడు. అంతేకాక.. జట్టు మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్ ఈ మ్యాచ్‌ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్ అవ్వనున్నాడు. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించి కుక్‌కి మంచి ఫెయిర్‌వెల్ ఇవ్వాలని ఇంగ్లండ్ జట్టు భావిస్తోంది. ఇప్పటికే ఈ సిరీస్‌లో మూడు మ్యాచుల్లో విజయం సాధించి ఇంగ్లండ్ 3-1 తేడాతో సిరీస్‌ని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈఏడాది మొదట్లో కూడా భారత్  1-2తో దక్షిణాఫ్రికాతో సీరీస్ కోల్పోయింది.  ఓవెల్ వేదికగా మ్యాచ్ రేపటి నుండి 7-11 తేదీ వరకు జరుగుతుంది.

జట్లు:

ఇంగ్లాండ్ : అలెస్టర్ కుక్, కీటన్ జెన్నింగ్స్, మొయిన్ అలీ, జో రూట్(కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్, జాస్ బట్లర్, శామ్ కర్రన్, అదిల్ రషీద్, సువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్‌సన్.

భారత్ : విరాట్ కోహ్లి (సి), శిఖర్ ధావన్, పృథ్వీ షా, KL రాహుల్, చేతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, దినేష్ కార్తీక్, రిషభ్ పంత్ (వికె), కరుణ్ నాయర్, హరిక్ పాండ్య, ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, హనుమ విహారి, ఇషాంత్ శర్మ, శ్రీధర్ సింగ్, ఉమేష్ యాదవ్, శార్తుల్ ఠాకూర్, మొహమ్మద్ షామి, జాస్ప్రీత్ బుమ్రా.

మామాట:  ఈ మ్యాచ్ గెలిచి గౌరవం కాపాడండి బ్రో

Leave a Reply