ఈరోజు గెలిస్తే ఫైనల్ బెర్త్ ఖాయం…..

Share Icons:

కొలంబో,14 మార్చి:

శ్రీలంకలో జరుగుతున్న ముక్కోణపు టీ-20 టోర్నీ మొదటి మ్యాచ్ లో లంక చేతిలో ఓడిపోయిన టీమిండియా అనూహ్యంగా పుంజుకుని తరవాత రెండు మ్యాచ్ ఎల్‌ఎల్లో తిరుగులేని విజయాలని సొంతం చేసుకుంది.

ఈ నేపథ్యంలో టోర్నీలో తన చివరి మ్యాచ్ బంగ్లాదేశ్ జట్టుతో ఆడనుంది. ఒకవేళ ఈ మ్యాచ్ గాని భారత్ గెలిస్తే, ఎలాంటి రన్ రేట్ లతో సంబంధం లేకుండా నేరుగా ఫైనల్ కు చేరుతుంది.

అదే సమయంలో శ్రీలంకపై 215 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి అద్భుత విజయం సాధించిన బంగ్లా జట్టు కూడా ఈ మ్యాచ్‌లో గెలిచి ఫైనల్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలని చూస్తోంది. ఒకవేళ ఈ మ్యాచ్ లో ఇండియా ఓడిన ఫైనల్‌ బెర్తు కోసం బంగ్లా-లంక చివరి మ్యాచ్ ఫలితంపై ఆధారపడాల్సి ఉంటుంది. అదే సమయంలో నెట్‌రన్‌ రేట్‌ కూడా కీలకం అవుతుంది. ప్రస్తుతానికైతే రెండు విజయాలతో టీమిండియా +0.21 రన్‌రేట్‌తో టాప్ లో ఉంది.

జట్ల బలాబలాలు

ఇక ఇరు జట్ల బలాబలాలు విషయానికొస్తే  భారత్ ఈ మ్యాచ్‌లో కూడా ప్రయోగాలు చేసే అవకాశాల్లేవు. ఎందుకంటే ఫైనల్ బెర్త్ తేలే మ్యాచ్ కాబట్టి ముందు ఆడిన తుది జట్టుతోనే బరిలోకి దిగాలని రోహిత్ బృందం యోచిస్తున్నది.

కాబట్టి బెంచ్ మీద ఉన్న ఆటగాళ్ళకి అవకాశం దొరకడం కష్టమే. ఇది ఇలా ఉండగా కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ ఆందోళన కలిగిస్తున్నది. దీంతో ఈ మ్యాచ్ లో శిఖర్ ధావన్‌తో కలిసి రాహుల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశాలనూ పరిశీలిస్తున్నారు.

రైనా ఫర్వాలేదనిపిస్తున్నాడు. అయితే మిడిలార్డర్ భారాన్ని మనీష్ పాండే, దినేశ్ కార్తీక్ పంచుకోవడం జట్టుకి కలిసొచ్చే అంశం.

అలాగే ఆల్‌రౌండర్‌గా బరిలో దిగిన విజయ్ శంకర్ మరింత న్యాయం చేయాల్సి ఉంది. గత రెండు మ్యాచ్‌ల్లో నాలుగు ఓవర్ల కోటాను పూర్తి చేయలేకపోయిన జయదేవ్ ఉనాద్కట్ ధారాళంగా పరుగులు సమర్పించుకోవడం ఆందోళనకరం.

శార్దూల్ ఠాకూర్ అద్భుతంగా రాణిస్తుండగా, స్పిన్నర్ చాహల్ ఇంకా మెరుగు పడాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద  భారత్ అన్ని రంగాల్లో రాణిస్తే తప్ప ఈ మ్యాచ్ గెలుపు అంత సులువుకాకపోవచ్చు.

లంకపై 215 పరుగుల రికార్డు లక్ష్యాన్ని ఛేదించడంతో బంగ్లా జట్టులో ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ను ఓడిస్తే ఫైనల్ అవకాశాలు మరింత మెరుగుపడుతాయి.

కాబట్టి ఏమాత్రం అలసత్వం లేకుండా ఆడాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. లిట్టన్ దాస్, తమీమ్ సూపర్ ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. సౌమ్య, ముష్ఫికర్ కొద్దిగా సాయం ఇక బంగ్లా విషయానికొస్తే లంకపై 215 పరుగుల రికార్డు లక్ష్యాన్ని ఛేదించడంతో ఆ జట్టులో ఆత్మవిశ్వాసం రెట్టింపైంది.

లిట్టన్ దాస్, తమీమ్ సూపర్ ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. సౌమ్య, ముష్ఫికర్ కొద్దిగా సాయం అందించినా భారీ స్కోరు ఖాయం. ఇక కెప్టెన్ మహ్మదుల్లా సుడిగాలి ఇన్నింగ్స్ బంగ్లాకు లాభించే అంశం. టోర్నీ ఆరంభంతో పోలిస్తే బంగ్లా బౌలింగ్ కూడా గాడిలో పడింది.

జట్లు (అంచనా)

భారత్: రోహిత్ (కెప్టెన్), ధవన్, రాహుల్, రైనా, మనీష్, కార్తీక్, విజయ్ శంకర్, సుందర్, చాహల్, శార్దూల్, ఉనాద్కట్.

బంగ్లాదేశ్: మహ్మదుల్లా (కెప్టెన్), తమీమ్, సౌమ్య సర్కార్, లిట్టన్ దాస్, ముష్ఫికర్ రహీమ్, షబ్బీర్ రెహమాన్ / ఆరిఫుల్ హక్, మెహిది హసన్, ముస్తాఫిజుర్, టస్కిన్ / అబు జాయేద్, రూబెల్ హుస్సేన్, నజ్ముల్ ఇస్లామ్.

పిచ్-వాతావరణం

ప్రేమదాస లోని పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం. బ్యాట్స్‌మెన్ నిలకడగా ఆడితే భారీ స్కోర్లు ఖాయం. వర్షం ముప్పు ఉంది. రాత్రి 7 గం. నుంచి డీస్పోర్ట్స్‌, డీడీ స్పోర్ట్స్‌లలో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది.

మామాట: ఈ మ్యాచ్ లో గెలిచి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంటారా…?

English summary:

India’s road to the final of the Nidahas Trophy is straightforward beat Bangladesh in game five of the tri-series on Wednesday, and they will reach the summit. But Bangladesh, having pulled off a superb chase against Sri Lanka over the weekend, will have plans to stall Rohit Sharma’s team.

Leave a Reply