TRENDING NOW

సెప్టెంబర్ 18 నుంచి ఆ దేశ వస్తువులపై ట్యాక్స్ పెంపు…

సెప్టెంబర్ 18 నుంచి ఆ దేశ వస్తువులపై ట్యాక్స్ పెంపు…

ఢిల్లీ, 4 ఆగష్టు:

అగ్రరాజ్యం అమెరికా గత కొన్ని రోజులుగా విదేశీ వస్తువులపై ట్యాక్స్‌లు పెంచుతోన్న విషయం తెలిసిందే. ఇక ఈ చర్యలకి ప్రతిగా ఇతర దేశాలు కూడా ధీటుగా స్పందిస్తూ అమెరికా నుంచి దిగుమతయ్యే వస్తువులపై ట్యాక్స్ విధిస్తున్నారు.

అయితే ఈ ట్యాక్స్‌ల పెంపు నుంచి తమ దేశ వస్తువులను మినహాయించాలని భారత్ అమెరికాని కోరింది. కానీ భారత్ అభ్యర్ధనని ఆ దేశం తిరస్కరించింది. దీంతో అమెరికా నుంచి దిగుమతయ్యే వస్తువులపైనా కూడా భారత్ ట్యాక్స్ విధించనుంది. సెప్టెంబర్‌ 18 నుంచి  పన్నుల పెంపు అమల్లోకి వస్తుందని తెలిపింది. ఆగస్టు 4 నుంచి పెంచిన ట్యాక్సులను అమలు చేయాలని భావించింది. అయితే తర్వాత తేదీని సెప్టెంబరు 18కు మార్చింది.

GCR Infra AD, Maamaata, SEO, Primepagesinfo,
treefurn AD
Life Homepathy

అమెరికా నుంచి భారత్‌కు దిగుమతి చేసుకునే బాదం, వాల్‌నట్స్‌, ఆపిల్స్, తదితర ఉత్పత్తులపై పన్నులు పెరగనున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి భారత్‌, అమెరికాల మధ్య వాణిజ్య సంబంధ వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయి.

మామాట: చర్యకి ప్రతిచర్య సరిపోయింది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: