వదలని వర్షం…రెండో టీ20 రద్దు..1-0 ఆధిక్యంలో ఆసీస్…

Share Icons:

మెల్‌బోర్న్, 23 నవంబర్:

మెల్‌బోర్న్ వేదికగా జరిగిన భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన రెండో టీ20మ్యాచ్ వర్షం కరణంగా రద్దయింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో 19 ఓవర్ల తర్వాత మొదలైన వర్షం మళ్లీ మ్యాచ్‌ను సాగనివ్వలేదు. మధ్యమధ్యలో ఆగుతూ, కురుస్తూ విసిగించింది.

మొదట 19 ఓవర్లలో 137 పరుగుల టార్గెట్ విధించారు. ఆ తర్వాత దానిని 11 ఓవర్లలో 90 పరుగులకు కుదించారు. అది కూడా సాధ్యం కాకపోవడంతో చివరికి 5 ఓవర్లలో 46 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు.

అయినా వెంటనే మరోసారి వర్షం రావడంతో టీమిండియా అసలు చేజింగ్ మొదలుపెట్టక ముందే మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. అయితే తొలి మ్యాచ్‌లో ఓడిపోయి రెండో టీ20లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్న కొహ్లీసేనపై వరుణ దేవుడు నీళ్ళు చల్లాడు. దీంతో మూడు టీ20ల సిరీస్‌లో ఆస్ట్రేలియా ఇంకా 1-0 ఆధిక్యంలో ఉంది. ఇక చివరి మ్యాచ్‌లో భారత్ గెలిస్తే సిరీస్ సమం చేయొచ్చు..లేదంటే సిరీస్ ఆసీస్ సొంతం చేసుకుంటుంది. ఇక ఇరు జట్ల మధ్య మూడో మ్యాచ్ ఆదివారం జరగనుంది.

మామాట: వరుణుడు ఎంత పని చేశాడు

Leave a Reply