సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చిన హౌస్ మేట్స్

Share Icons:

హైదరాబాద్:

 

బిగ్ బాస్ గురువారం ఎపిసోడ్ లో హౌస్ లో దేశభక్తి ఉప్పొంగింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హౌస్ మేట్స్ మంచి స్కిట్స్ చేసి సమాజానికి మెసేజ్ ఇచ్చారు. ఎపిసోడ్ ప్రారంభంలో బాబా భాస్కర్, శ్రీముఖి లు ఇంటి నుంచి వెళ్ళిపోయిన జాఫర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఆ తర్వాత కిచెన్ లో పునర్నవి, వితికల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. అలాగే బాత్ రూమ్ లో మహేశ్, బాబా భాస్కర్- హిమజ, శ్రీముఖిలు సరదాగా గొడవపడ్డారు.

 

అనంతరం బిగ్ బాస్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హౌస్ మేట్స్ కి స్కిట్స్ చేయమని చెప్పారు. శ్రీముఖి, అలీలు యాంకర్స్‌గా రంగంలోకి దిగ‌గా మహేష్, రవి, పునర్నవి, వితికా, అషు‌లు స్త్రీ పురుష స‌మానత్వంపై చ‌క్క‌ని స్కిట్ ప్ర‌ద‌ర్శించారు. స‌మాజంలో మగ‌వాళ్ళ ఆధిప‌త్యం ఆడ‌వాళ్ల‌పై ఏ విధంగా ఉందో చెప్ప‌డంతో పాటు ఆడవాళ్ళ గొప్పతనాన్ని వితిక, పునర్నవిలు చాలా చక్కగా తెలియజేశారు.

 

ఆ త‌ర్వాత శ్రీముఖి, బాబా భాస్కర్, వరుణ్, హిమజ, అలీ, జ్యోతి, రోహిణి లు మ‌రో స్కిట్ చేశారు. ట్టిన దేశాన్ని, క‌న్న త‌ల్లితండ్రుల‌ని వ‌దిలి వెళ్ళే వారికి కౌంట‌ర్ ఇస్తూ మంచి సందేశం కూడా అందించారు. ఆ త‌రువాత భార‌త్ మాత కీ జై నినాదాలు చేశారు. చివరికి దేశభక్తి పాటలు ప్లే అవ్వగా హౌస్ మేట్స్ వాటికి డ్యాన్స్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు.

Leave a Reply