IND vs AUS 1st ODIలో ఆస్ట్రేలియా ఫీల్డింగ్.. భారత్ జట్టులో కీలక మార్పులు

Share Icons:
భారత్‌తో వాంఖడే వేదికగా మంగళవారం జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్ ఫించ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. వాంఖడే పిచ్ బ్యాటింగ్‌కి అనుకూలమని వార్తలు వస్తుండగా.. రాత్రి 7 గంటల తర్వాత మంచు కురిసే అవకాశం ఉంది. దీంతో.. టాస్ గెలిచిన అరోన్ ఫించ్ ఛేదనకే మొగ్గు చూపాడు. భారత్ గడ్డపై వన్డేల్లో ఆస్ట్రేలియాదే ఆధిపత్యం. ఇప్పటి వరకూ ఇక్కడ 61 మ్యాచ్‌ల్లో తలపడితే.. 29 మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా, 27 మ్యాచ్‌ల్లో టీమిండియా గెలుపొందింది. మిగిలిన మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు.

తుది జట్టులో ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లకి అవకాశం దక్కగా.. మూడో స్థానంలో కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చేయనున్నాడు. దీంతో విరాట్ కోహ్లీ నెం.4లో ఆడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక మనీశ్ పాండే, కేదార్ జాదవ్, నవదీప్ షైనీ, చాహల్‌, శివమ్ దూబేకి తుది జట్టులో అవకాశం దక్కలేదు. సీనియర్ ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు శార్ధూల్ ఠాకూర్‌ని టీమ్‌లోకి ఎంచుకున్న కోహ్లీ.. స్పిన్నర్లు జడేజా, కుల్దీప్‌‌లకి ఛాన్సిచ్చాడు.

Read More:

2019లో ఆఖరిగా ఐదు వన్డేల సిరీస్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి. ఆ సిరీస్‌లో తొలి రెండు వన్డేల్లోనూ భారత్ జట్టు విజయం సాధించగా.. ఆ తర్వాత వరుసగా మూడు వన్డేల్లోనూ గెలుపొందిన కంగారూలు సిరీస్‌‌ని ఎగరేసుకుపోయారు. తాజాగా మూడు వన్డేల సిరీస్‌ని కూడా ఆస్ట్రేలియా 2-1తో గెలుస్తుందని ఆ దేశ దిగ్గజ క్రికెటర్ రిక్కీ పాంటింగ్ ఇప్పటికే జోస్యం చెప్పాడు.

Read More:

భారత్, ఆస్ట్రేలియా మధ్య 2017 నుంచి మూడు ద్వైపాక్షిక సిరీస్‌లు జరగగా.. టీమిండియా 2-1తో ఆధిక్యంలో కొనసాగుతోంది. 2017, 2018లో కంగారూలపై వన్డే సిరీస్‌లు గెలిచిన భారత్ జట్టు.. 2019లో మాత్రం ఐదు వన్డేల సిరీస్‌ని చేజార్చుకుంది. దీంతో.. ఈ సిరీస్‌లో ఆ ఓటమికి బదులు తీర్చుకోవాలని కోహ్లీసేన ఉవ్విళ్లూరుతోంది.

India (Playing XI): Rohit Sharma, Shikhar Dhawan, Lokesh Rahul, Virat Kohli(c), Shreyas Iyer, Rishabh Pant(w), Ravindra Jadeja, Shardul Thakur, Kuldeep Yadav, Mohammed Shami, Jasprit Bumrah

Australia (Playing XI): David Warner, Aaron Finch(c), Marnus Labuschagne, Steven Smith, Ashton Turner, Alex Carey(w), Ashton Agar, Pat Cummins, Mitchell Starc, Kane Richardson, Adam Zampa