పెరుగుతున్నఈ-కామర్స్ సంస్థల ఆదాయం..

Share Icons:

ముంబై, 25 జూన్:

మనదేశంలో రోజురోజుకు ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు చేసేవారి సంఖ్య పెరుగుతున్నది. దీంతో ఈ-కామర్స్ సంస్థలకు సమకూరే ఆదాయం పెరుగుతూ వస్తుంది.

గడిచిన సంవత్సరంలో వీటి ఆదాయం 25 బిలియన్ డాలర్లు ఉండగా, 2022 నాటికి 52 బిలియన్ డాలర్లకు చేరుకోనున్నదని ఒక నివేదిక వెల్లడించింది.

అంటే మన కరెన్సీలో చెప్పాలంటే రూ.3.50 లక్షల కోట్లకు పైమాటే. దాని ప్రకారం నికరంగా 20 శాతానికిపైగా వృద్ధిని నమోదు అవ్వనుంది.

ఇక అడ్మిటెడ్ నివేదిక ప్రకారం 2017లో మొత్తం దేశ జనాభాలో 37 శాతం మంది ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు. అందులో సుమారు 14 శాతం ఆన్‌లైన్ వేదికగా వస్తువులను కొనుగోలు చేస్తున్నారని తేలింది. అయితే 2022 నాటికి ఇంటర్నెట్ ఉపయోగించే వారి సంఖ్య 45 శాతానికి చేరితే, కొనుగోలుదారులు మాత్రం 90 శాతానికి చేరుకుంటారని అంచనా వేస్తున్నది.

కాగా, ఈ-కామర్స్ ఆదాయంలో 70 శాతం మొబైల్ ఫోన్ల విక్రయం ద్వారానే లభిస్తున్నది. 57 శాతం మంది వస్తువులను డెలివరీ చేసే సమయంలో చెల్లించేందుకు ఆసక్తి చూపుతుండగా, 15 శాతం మంది డెబిట్, 11 శాతం మంది క్రెడిట్ కార్డులను వినియోగిస్తున్నారు.

మామాట: అంతా ఇంటర్నెట్ మహిమా…

Leave a Reply