తెలంగాణలో ‘మోడల్’ రైతుబజార్…

Share Icons:

సిద్దిపేట, 5 ఫిబ్రవరి:

అన్ని హంగులతో ఆకట్టుకునే బస్టాండ్‌లను, సినిమా హళ్లను, షాపింగ్ మాల్స్‌ని చూశాం.

కానీ, రైతుల కోసం ఆధునిక రైతు బజార్లను ఏర్పాటు చేయడం ఎప్పుడైనా మన తెలుగు రాష్ట్రాల్లో చూశామా? అయితే అది చూడాలంటే తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట రైతు బజార్‌కు రావాల్సిందే..

రాష్ట్రంలోనే సాంకేతికంగా అన్ని రకాల అత్యాధునిక సదుపాయాలతో తొలి మోడల్ రైతుబజార్ భవనాన్ని సిద్దిపేటలో నిర్మించారు.

హైటెక్ ఆఫీసుల తరహాలో నిర్మించిన ఈ భవనాన్ని సోమవారం రాష్ట్ర భారీ నీటిపారుదల, మార్కెటింగ్‌శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించనున్నారు.

సిద్దిపేటలో పాత రైతుబజార్ 1999లో ఏర్పాటైంది. ఇక్కడికి చుట్టు పక్కల ఉన్న వివిధ గ్రామాల రైతులు తాము పండించిన కూరగాయలను తీసుకొచ్చి అమ్ముతుంటారు.

ఆ అమ్మకాలు రేకులషెడ్లలో కొనసాగుతుండటంతో వర్షాకాలంలో రైతులకు, వినియోగదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేవి.

siddiepta rythu bazar

ఇక ఈ పరిస్థితిని స్వయంగా గమనించిన మంత్రి హరీశ్‌రావు రైతుబజార్ కొనసాగుతున్న స్థలంలోనే ఆధునిక రైతు బజార్‌ని నిర్మించాలని అనుకున్నారు.

అందుకనుగుణంగా అధికారులతో ప్రతిపాదనలు సిద్ధం చేయించారు. మార్కెటింగ్ శాఖలోనే నూతన ఒరవడిని తీసుకురావాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోనే ఒక మోడల్ రైతుబజార్ నిర్మాణానికి సిద్దిపేట నుంచే ఆయన శ్రీకారం చుట్టారు. అయితే భవన నిర్మాణం కేవలం 13 నెలల వ్యవధిలోనే పూర్తవ్వడం గమనార్హం. దీనికి సుమారు రూ.8.16 కోట్ల వ్యయమైంది.

ఈ భవనంలో మొదటి, రెండో అంతస్తులో కలిపి 332 స్టాళ్లను ఏర్పాటుచేశారు. కూరగాయలు అమ్మే రైతులకు బ్లాకులవారీగా స్టాళ్ల నంబర్లు కేటాయిస్తారు. మొదటి, రెండో అంతస్తులో కూరగాయల ధరలు తెలిపే 7డిస్‌ప్లే బోర్డులను ఏర్పాటుచేశారు.

మామాట: మరి ధరలు ఎలా ఉంటాయో..?

English summary:

In the telangana state the first model raithu bazaar was constructed at Sidipeta.  The building, constructed in the form of corporate office, will be opened on Monday by the state’s heavy irrigation and marketing minister Tanniru Harishrao.

Leave a Reply