కొత్త ఆర్డినెన్స్ : మైనర్లపై అత్యాచారానికి శిక్ష మరణమే

Share Icons:

న్యూఢిల్లీ, ఏప్రిల్ 21 :

చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా ఉండాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ఇలాంటి నేరాలకు మరణశిక్ష అమలు చేసే ఆర్డినెన్సును తీసుకువచ్చింది.

ఈ మేరకు క్యాబినెట్ శనివారం ఆమోద ముద్ర వేసింది. ఇక ఆర్డినెన్సు వెలువడడమే తరువాయి.

ఉన్నవ్, కథువా సంఘటనలు దేశంలో దుమారం రేపాయి. దేశ పరువును గంగలో కలిపాయి. లండన్ లో పర్యటిస్తున్న ప్రధానమంత్రికి చేదు అనుభవాలు ఎదుయ్యాయి. చాలా దేశాలలో నిరసనలు వెల్లువెత్తాయి.

ఈ క్రమంలో కఠిన చర్యల దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పోయిన పరువును తిరిగి నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోంది.

కొత్త ఆర్డినెన్సును ప్రతిపాదనకు తీసుకు వచ్చింది. ఈ విషయంపై కేంద్ర మంత్రి వర్గం కీలక చర్చలు జరిపింది. కొద్ది సేపటి క్రితం కేంద్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది.

ఈ సమావేశంలో లైంగిక నేరాల నుంచి చిన్నారులకు రక్షణ(పోక్సో ) చట్టానికి సవరణలు చేసేందుకు కేంద్ర మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసింది.

0-12 ఏళ్ల వయసు చిన్నారులపై అత్యాచారం జరిపే వారికి మరణ శిక్ష విధించే విధంగా రూపొందిన ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపింది.

అత్యాచారం కారణంగా మహిళ చనిపోయినా లేదా జీవచ్ఛవంగా మారిన సందర్భాల్లో దోషులకు మరణ శిక్ష విధించేలా ప్రభుత్వం చట్టం తీసుకువచ్చింది. దీనికి ఇక రాష్ట్రపతి ఆమోద ముద్ర లభించాల్సి ఉంది.

మామాట : పోయిన పరువును కాపాడుకునే ప్రయత్నాలు

English Summary :

Central government is made a ordinance on the case of minor rape incidents. When minor girl raped by culprits will be punished to death penalty. Central government is prepared this ordinance and cabinet approved this proposal After Kathuva and Unnav incidents pretest occurs in across the world.

Leave a Reply