తలైవా పోలిటికల్ ఎంట్రీ: ముఖ్యమంత్రి కావాలనుకోవడం లేదు….కానీ

Share Icons:

చెన్నై: ఎన్నో ఏళ్లుగా సస్పెన్స్‌లో ఉన్న తలైవా రజనీకాంత్ పోలిటికల్ ఎంట్రీపై స్పష్టత వచ్చింది. రాజకీయాల్లో తన పాత్రపై రజనీకాంత్ క్లారిటీ ఇచ్చారు. చెన్నైలో మాట్లాడిన ఆయన..  తన ఆలోచనలను స్పష్టంగా వివరించాలనుకుంటున్నట్లు చెప్పారు. ఈ వ్యవస్థ మారాలని, దీనిని సరిదిద్దవలసి ఉందన్నారు. తాను ముఖ్యమంత్రిని కావాలనుకోవడం లేదన్నారు. ముఖ్యమంత్రి పదవి గురించి తాను ఆలోచించడం లేదన్నారు. తన పార్టీలో యువతకు పెద్ద పీట వేస్తామన్నారు. విద్యావంతులు, నిజాయితీపరులకు ప్రాధాన్యం ఇస్తామన్నారు.

ఇక ఈ సందర్భంగా ఆయన మాజీ ముఖ్యమంత్రి ‘అమ్మ’ జయలలితను ప్రస్తావించారు. ఆమె మరణానంతరం రాజకీయంగా పెద్ద లోటు ఏర్పడిందన్నారు. తన పార్టీలో యువతకు స్థానం కల్పిస్తామన్నారు. శాసన సభలో కూర్చోవడం గురించి కూడా ఊహించడం లేదన్నారు. తన పార్టీలో 65 శాతం మంది విద్యావంతులైన యువత ఉంటుందన్నారు. నేడు రాజకీయ పార్టీలు వ్యాపార సంస్థల మాదిరిగా నడుస్తున్నాయని, వాటికి ఓట్లు మాత్రమే కావాలని, ప్రజల గురించి పట్టించుకోవడం లేదని అన్నారు. ప్రజల కోసం పని చేయవలసి ఉందని, నిజాయితీపరులకు తన పార్టీ తరపున పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. డీఎంకే, ఏఐఏడీఎంకేలను తన పార్టీ వ్యతిరేకిస్తుందన్నారు. తమిళనాడు రాజకీయాలను విశ్లేషిస్తున్నానని చెప్పారు.

కాగా, 15 ఏళ్లుగా తన రాజకీయ ప్రవేశంపై అనేక ఊహాగానాలు వచ్చాయని, వాటికి స్వస్తి పలకాల్సిన సమయం వచ్చిందన్నారు. 2017లో రాజకీయ ప్రవేశంపై వివరణ ఇచ్చానన్న ఆయన.. నాటి నుంచి తమిళనాడు పరిస్థితులను విశ్లేషించడం మొదలుపెట్టానన్నారు. ప్రజల మనస్తత్వం కూడా మారాల్సిన అవసరం ఉందన్నారు.  వ్యవస్థలో మార్పు రావలసి ఉందని భావించానని.. రాజకీయ నాయకులకు ప్రజలంటే కేవలం ఓట్లేనని.. సమయానికి తగ్గట్టు పాలన లేదని వ్యాఖ్యానించారు. అత్యధికమంది పార్టీలో భాగస్వాములయ్యేలా చూసుకుంటానన్నారు. తనకు మూడు ప్రణాళికలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం, పార్టీలపై ఒకే వ్యక్తి పెత్తనం సరికాదన్నారు. ఇప్పుడున్న పార్టీల్లో 50ఏళ్లకు పైబడినవాళ్లే ఉన్నారని.. రాజకీయాల్లోకి యువకులు రావాలని పిలుపునిచ్చారు.

 

Leave a Reply