భారత్ తీసుకునే ఏకపక్ష నిర్ణయాలు కశ్మీరీ జీవితాల్ని బాగుచేయలేవు:పాక్

40 militant groups were operating in Pakistan Imran Khan
Share Icons:

ఇస్లామాబాద్:

జమ్మూ కశ్మీర్‌ లో ఆర్టికల్ 370ని రద్దు చేసి… రెండుగా విభజించాలన్న భారత్ నిర్ణయంపై పాకిస్థాన్‌ తొలి ప్రకటన చేసింది. భారత్ ఏకపక్షంగా తీసుకునే ఏ నిర్ణయాలు కశ్మీరీల జీవితాలను బాగు పరచలేవని పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ పేర్కొన్నారు.

జమ్మూకశ్మీర్‌కు సంబంధించి భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్పందించిన ఆయన మాట్లాడుతూ…నరేంద్రమోదీ ప్రభుత్వ నిర్ణయం కశ్మీరీలకు, పాకిస్తానీయులకు ఆమోదయోగ్యం కాదన్నారు. భారత్‌ ప్రభుత్వ ధోరణిని తిప్పికొట్టేందుకు వీలైనన్ని అన్ని మార్గాల్లోనూ ప్రయత్నిస్తామని ఆయన స్పష్టం చేశారు. కశ్మీర్‌కు రాజకీయపరమైన, దౌత్యపరమైన మార్గాల్లో మాత్రమే..పరిష్కారం సాధ్యమని పాకిస్థాన్‌ నమ్మతుందని ఇమ్రాన్‌ స్పష్టం చేశారు.

అటు భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పాకిస్తాన్ విదేశాంగ వ్యవహారాల శాఖ స్పందించింది. కశ్మీర్ వివాద పరిష్కారం విషయంలో తమకూ సంబంధం ఉందని, భారత ప్రభుత్వం ఈ వివాదంపై అనుసరించిన అక్రమ విధానాలకు కౌంటర్ ఇచ్చేందుకు ఉన్న అన్ని అవకాశాలపై దృష్టి సారించినట్లు సదరు శాఖ తెలిపింది. కశ్మీర్ సమస్య పరిష్కార విషయంలో అక్కడి ప్రజలకు అండగా ఉంటామని చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామని పాకిస్తాన్ చెప్పుకొచ్చింది

Leave a Reply