శాంతి యత్నాలకు భారత్ స్పందించడంలేదు…

Share Icons:

ఇస్లామాబాద్, 8 జనవరి:

పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ భారత దేశంపై మరోసారి విమర్శలు గుప్పించారు. కశ్మీరీల హక్కులను భారత ప్రభుత్వం కాలరాస్తోందని మండిపడ్డారు. తాజాగా టర్కిష్ న్యూస్ ఏజెన్సీ టీఆర్‌టీ వరల్డ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ… తాను చేస్తున్న శాంతి యత్నాలకు భారత ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపించారు. ఇక  అణ్వాయుధ సామర్థ్యంగల ఈ రెండు దేశాలు యుద్ధం చేయడమంటే ఆత్మహత్య చేసుకున్నట్లేనని అన్నారు. రెండు అణ్వాయుధ దేశాలు యుద్ధం గురించి కనీసం ఆలోచించడం కూడా సరికాదని చెప్పారు.

అలాగే ప్రచ్ఛన్న యుద్ధం గురించి కూడా ఆలోచించకూడదన్నారు. ఇరు దేశాల మధ్య శాంతి నెలకొనాలంటే ద్వైపాక్షిక చర్చలు మాత్రమే ఏకైక మార్గమని చెప్పారు.

అయితే ఇమ్రాన్ పార్టీ పీటీఐ వర్గాల సమాచారం ప్రకారం భారతదేశంతో చర్చలు జరపాలని ఇమ్రాన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మామాట: మరి ఇమ్రాన్ వ్యాఖ్యలపై భారత్ ఎలా స్పందిస్తుందో..

Leave a Reply