నలుగురితో ప్రేమాయణం, భర్తను ముక్కలు ముక్కలు నరికి..

Share Icons:

గోవా, మే 10 :

గోవా అంటేనే పాశ్చాత్య పోకడలు చాలా ఎక్కువ. యువతీ యువకులు హద్దులు మీరి ప్రవర్తిస్తుంటారు. ఓ యువతి అలాగే తిరుగుళ్ళకు అలవాటు పడింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, నలుగురితో ప్రేమాయణం సాగించింది. భర్త నిలదీయడంతో ముక్కలు ముక్కలు చేసి మాయం చేసింది. సంఘటన వివరాలిలా ఉన్నాయి.

కర్ణాటక పరిధిలోని బైల్ హోగెనల్‌కు చెందిన 38 ఏళ్ల బసవరాజ్ బారి, 30 ఏళ్ల కల్పన దంపతులు. వీరు బతుకుదెరువు కోసం గోవా చేరారు. బసవరాజ్ అక్కడా ఇక్కడా పని చేసుకుని సంసారాన్నివెల్లదీస్తున్నారు. ఈ క్రమంలో కల్పనకు రాజస్థాన్‌కు చెందిన సురేష్ కుమార్, మార్మగోవాకు చెందిన పంకజ్ పవార్, కుర్చోరెమ్‌కు చెందిన అబ్దుల్ షేక్, ఆదిత్య గుజ్జార్‌లతో స్నేహం కుదిరింది.

గోవా కదా.. కాస్త స్పీడు ఎక్కువ, వీరి స్నేహం వివాహేతర సంబంధంగా మారింది. ఎంతలా బరితెగించి అంటే కల్పన ఏకకాలంలో నలుగురితో ఎఫైర్ సాగిస్తోంది. భార్య నడతపై అనుమానం వచ్చిన బసవరాజ్ కల్పనను నిలదీశారు. పదేపదే హెచ్చరికలు చేస్తుండటంతో కల్పన బసరాజ్ అడ్డు తొలగించుకోవాలనుకుంది. అతడిని లేపేయాలని ప్లాన్ వేసింది. తన నలుగురు ప్రియులను పిలిపించి పక్కా ప్రణాళిక వేసింది.

భర్త బసవరాజ్‌ను తాళ్లతో కట్టేసి హత్య చేశారు. అతడి మృత దేహాన్ని మూడు ముక్కలు చేసి బ్యాగులో సర్దేసి వేర్వేరు ప్రాంతాల్లో పడవేశారు. బసవరాజ్ కనిపించకపోవడంతో పక్కింటి వాళ్ళు మే 1న పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కల్పనతో సహా నలుగురిని అదుపులోకి తీసుకుని నాలుగు పీకేసరికి అసలు నిజం కక్కేశారు. మరో నిందితుడు కోసం పోలీసులు గాలిస్తున్నారు.

మామాట : వివాహేతర బంధం ఎలాంటి దారుణాలనైనా చేయిస్తుంది.

Leave a Reply