అదేగనుక జరిగితే జగన్ కు తిరుగుండదు….

cm jagan serious discussion on sand issue in ap
Share Icons:

అమరావతి: ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చి దాదాపు ఆరు నెలలు కావొస్తుంది. అయితే ఈ ఆరు నెలల్లోనే జగన్ అనేక పథకాలు, నిర్ణయాలు తీసుకుని ప్రజలకు మంచి జరిగేలా చేశారు. అలా అని ఆరు నెలల కాలంలో కొన్ని సమస్యలు కూడా వచ్చాయి. కానీ ఏది ఉన్న ప్రస్తుతానికి ప్రజలు మాత్రం జగన్ పట్ల పాజిటివ్ గానే ఉన్నారు. అయితే ఈ పాజిటివిటీని మరింత పెంచుకోవాలంటే జగన్ అనుకున్నది ఒకటి జరిగితే తిరుగుండదు. కాకపోతే సాధ్యం కానీ పని. అది ఏంటో ఈ పాటికే అర్ధమైపోయి ఉంటుంది. మద్యపాన నిషేధం.

ఆంధ్రలోని మహిళల కష్టాలు చూసి జగన్ తన పాదయాత్రలో భాగంగా మద్యపాన నిషేధం చేస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారం అధికారంలోకి రాగానే మొదటి దశలో భాగంగా మద్యపాన నిషేధం మొదలుపెట్టారు. షాపుల సంఖ్య 20 శాతానికి తగ్గించి మిగతా వాటినే ప్రభుత్వమే నడుపుతుంది. అలాగే మద్యం ధరలని కూడా పెంచింది. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది.

అలాగే వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం, రాష్ట్రంలో బార్ల సంఖ్యను తగ్గించే దిశగా మరో కీలకమైన ముందడుగు వేసింది. ఇప్పుడున్న బార్ల సంఖ్యను 40 శాతానికి తగ్గించాలన్నది జగన్‌ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం. నిజానికి, కొత్త మద్యం విధానం ద్వారా ప్రభుత్వమే మద్యం దుకాణాల్ని నిర్వహిస్తున్నా, మద్యం దుకాణాల సంఖ్య కొంతమేర తగ్గినా, రాష్ట్రంలో మద్యం వినియోగం మాత్రం తగ్గలేదు. పైగా, ధరలు పెంచడంతో.. జనాల జేబులకు చిల్లు, ప్రభుత్వ ఖజానా ఫుల్లు.. అన్నట్టు తయారైంది వ్యవహారం.

ఇప్పుడిక బార్లు కూడా తగ్గించేస్తే, కొంతవరకు కంట్రోల్ కావొచ్చు. అయితే ఇక్కడ ఒక్కటి చెప్పాలి. మద్యం అనేక అనర్ధాలకి కారణం. ఆ మద్యాన్ని రాష్ట్రం నుంచి తరిమేయగలిగితే మాత్రం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పేరు రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. కానీ, అది సాధ్యమేనా.? అన్నది ప్రస్తుతానికి మిలియన్‌ డాలర్ల ప్రశ్నే. ఎందుకంటే, మద్యం లేనిదే కొందరు ఉండలేరు. అలాగే మద్యమే రాజకీయాన్ని కూడా నడుపుతోంది. మరి ఇలాంటి తరుణంలో మద్య నిషేధం సాధ్యమయ్యే పనే అవుతుందా అంటే చెప్పలేం.

 

Leave a Reply