బ్యాంక్ ఉద్యోగాలు….ఐ‌డి‌బి‌ఐలో అసిస్టెంట్ మేనేజ‌ర్ పోస్టులు

Share Icons:

 

ముంబై, 24 జూన్:

ముంబ‌యిలోని ఐడీబీఐ బ్యాంకు… అసిస్టెంట్ మేనేజ‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఎంపికైన‌ అభ్య‌ర్థులను ప్రాథ‌మికంగా పీజీ డిప్లొమా కోర్సు శిక్ష‌ణ‌కు తీసుకుంటారు. ఈ కోర్సు పూర్తి చేసిన అనంతరం బ్యాంకు నిబంధ‌న‌ల‌కు లోబ‌డి అసిస్టెంట్ మేనేజ‌ర్ పోస్టులో నియ‌మిస్తారు.

ఉద్యోగ వివ‌రాలు…

కోర్సు: పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్‌

కాల‌వ్య‌వ‌ధి: ఒక ఏడాది

శిక్ష‌ణ కేంద్రం: మ‌ణిపాల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్‌, బెంగ‌ళూరు

ఖాళీలు: 600

అర్హ‌త‌: ఏదైనా గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌.

వ‌య‌సు: 01.06.2019 నాటికి 21-28 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి.

ఎంపిక‌: రాత‌ప‌రీక్ష‌, ప‌ర్స‌న‌ల్‌ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

ప‌రీక్ష తేది: 21.07.2019

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల‌కు రూ.150; మిగిలిన‌వారికి రూ.700

ఫీజు చెల్లింపు, ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 03.07.2019

వెబ్‌సైట్: https://www.idbibank.in/idbi-bank-careers-current-openings.asp

 

అటు భార‌త ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ‌కు చెందిన న్యూదిల్లీలోని డిఫెన్స్ రిసెర్చ్& అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ ఆర్గ‌నేజేష‌న్ (డీఆర్‌డీఓ), రిక్రూట్‌మెంట్ అండ్ అసెస్‌మెంట్ సెంట‌ర్ (ఆర్ఏసీ) సైంటిస్ట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు..

* మొత్తం ఖాళీలు: 40

పోస్టులు – ఖాళీలు: సైంటిస్ట్(ఎఫ్‌) – 02, సైంటిస్ట్(ఈ) – 04, సైంటిస్ట్(డీ) – 13, సైంటిస్ట్‌(సీ) – 21.

అర్హ‌త‌: స‌ంబంధిత విభాగాల్లో ప్ర‌థ‌మ శ్రేణి బీఈ/ బీటెక్, ఎంఈ/ ఎంటెక్‌ ఉత్తీర్ణ‌త‌. జ‌ర్మ‌న్, ఫ్రెంచ్‌, ర‌ష్య‌న్‌, జ‌ప‌నీస్‌, చైనీస్ భాష‌ల్లో ప్రావీణ్యం ఉండాలి.

ఎంపిక‌: షార్ట్ లిస్టింగ్‌, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: జులై 12.

https://www.drdo.gov.in/drdo/English/index.jsp?pg=homebody.jsp

 

Leave a Reply