ఎల్‌ఈ‌డి బెయిల్స్ మార్చే ఉద్దేశం లేదంటున్న ఐసీసీ

BCCI fires on icc because irregular schedule of Asia cup
Share Icons:

లండన్, 12 జూన్:

ప్రపంచ కప్ పోటీల్లో ఎల్‌ఈ‌డి బెయిల్స్‌పై వివాదం చెలరేగుతుంది. బౌలింగ్ సమయంలో బాల్ వికెట్లని తాకిన బెయిల్స్ పడకపోవడంతో…అంపైర్ బ్యాట్స్‌మెన్‌ని నాటౌట్‌గా పరిగణిస్తున్నాడు. దీంతో ఎల్‌ఈ‌డి బెయిల్స్ మార్చాలని అన్నీ దేశాల జట్ల నుంచి డిమాండ్ వస్తోంది.

అయితే ఈ ఎల్‌ఈ‌డి బెయిల్స్‌ని మార్చే ఉద్దేశం లేదని ఐసీసీ తేల్చి చెప్పింది. టోర్నీ మధ్యలో ‘జింగ్’ బెయిల్స్‌ను మార్చమని, ఆట సమగ్రతను కాపాడాల్సిన అవసరం ఉందని, ప్రపంచకప్‌లో భాగంగా జరిగే 48 మ్యాచ్‌ల్లోనూ ఇవే బెయిల్స్ ఉంటాయని స్పష్టం చేసింది.

కాగా, ఆదివారం టీమ్‌ఇండియా, ఆస్ట్రేలియాల మధ్య మ్యాచ్‌లో బుమ్రా వేసిన బంతి డేవిడ్‌ వార్నర్‌ బ్యాట్‌ను తాకుతూ లెగ్‌ స్టంప్స్‌ను బలంగా తాకింది. అయినా వికెట్ల మీద నుంచి బెయిల్స్‌ కదల్లేదు. దీంతో వార్నర్‌ బతికిపోయాడు.

Leave a Reply