ఐబీపీఎస్‌: 12,500 క్లర్క్ పోస్టులు..తిరుపతి ఐ‌ఐ‌టిలో ఖాళీలు

IBPS clerk recruitment 2019-2020
Share Icons:

హైదరాబాద్: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్స‌న‌ల్ సెల‌క్ష‌న్ (ఐబీపీఎస్‌) కామ‌న్ రిక్రుట్‌మెంట్ ప్రాసెస్ క్ల‌ర్క్స్‌-9 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. దీని ద్వారా దేశ‌వ్యాప్తంగా ఉన్న ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల్లో క్ల‌ర్క్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

ఐబీపీఎస్ – కామ‌న్ రిక్రుట్‌మెంట్ ప్రాసెస్(సీఆర్‌పీ) క్ల‌ర్క్స్‌-9

మొత్తం ఖాళీలు: 12,075 (ఆంధ్ర‌ప్ర‌దేశ్‌-777, తెలంగాణ‌-612)

అర్హ‌త‌: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.

వ‌య‌సు: 20-28 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ప‌్రిలిమిన‌రీ, మెయిన్ ఎగ్జామ్ ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

ముఖ్య‌మైన తేదీలు:

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 17.09.2019 నుంచి 09.10.2019 వ‌ర‌కు.

ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌తేది: 2019 డిసెంబరు 7, 8, 14, 21.

మెయిన్ ప‌రీక్ష‌తేది: 19.01.2020.

వెబ్ సైట్: https://www.ibps.in/

తిరుపతి ఐ‌ఐ‌టి

తిరుప‌తి (ఆంధ్ర‌ప్ర‌దేశ్‌)లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (ఐఐటీ) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

* ఫ్యాక‌ల్టీ పోస్టులు (ప్రొఫెస‌ర్‌, అసోసియేట్ ప్రొఫెస‌ర్‌, అసిస్టెంట్ ప్రొఫెస‌ర్‌)

విభాగాలు: సివిల్ & ఎన్విరాన్‌మెంట‌ల్ ఇంజినీరింగ్‌, హ్యుమానిటీస్ & సోష‌ల్ సైన్సెస్‌, కెమిక‌ల్ ఇంజినీరింగ్‌, ఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీరింగ్‌, మ్యాథ‌మెటిక్స్‌.

అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో పీహెచ్‌డీ ఉత్తీర్ణ‌త‌, టీచింగ్ అనుభవం.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్.

ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: 11.09.2019 నుంచి 18.10.2019 వ‌ర‌కు.

వెబ్ సైట్: https://facapp.iittp.ac.in/

బెల్ లో ఉద్యోగాలు

భార‌త ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ‌కు చెందిన భార‌త్ ఎల‌క్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్‌) కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్‌

మొత్తం ఖాళీలు: 30

విభాగాలు: ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యునికేష‌న్‌, మెకానిక‌ల్ ఇంజినీరింగ్‌

ఖాళీలున్న ప్రదేశాలు: హైద‌రాబాద్, భ‌టిండా.

అర్హ‌త: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.

వ‌య‌సు: 01.11.2019 నాటికి 26 ఏళ్లు మించ‌కూడ‌దు.

చివ‌రితేది: 03.10.2019

వెబ్ సైట్: http://www.bel-india.in/

గోవా షిప్‌యార్డ్ లో ఉద్యోగాలు..

భార‌త ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ‌కు చెందిన వాస్కోడిగామా (గోవా)లోని గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 29

పోస్టులు-ఖాళీలు: డిప్యూటి జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌-01, అసిస్టెంట్ మేనేజ‌ర్‌-02, జూనియ‌ర్ సూప‌ర్‌వైజ‌ర్‌-04, టెక్నిక‌ల్ అసిస్టెంట్‌-02, సేఫ్టీ స్టెవార్డ్‌-05, ఎలక్ట్రిక‌ల్ మెకానిక్‌-15.

విభాగాలు: సేఫ్టీ, ఎల‌క్ట్రిక‌ల్‌, మెకానికల్‌.

అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో ఐటీఐ, డిప్లొమా (ఇంజినీరింగ్), బీఈ/ బీటెక్ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.

ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష‌, ట్రేడ్ టెస్ట్/ ప‌్రాక్టిక‌ల్ టెస్ట్ ఆధారంగా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్.

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది: 07.10.2019.

ద‌ర‌ఖాస్తు హార్డ్‌కాపీల‌ను పంప‌డానికి చివరితేది: 14.10.2019.

చిరునామా: GM (HR&A), HR Department, Dr. B.R. Ambedkar Bhavan, Goa Shipyard Limited, Vasco-Da-Gama, Goa – 403802.

వెబ్ సైట్: https://goashipyard.in/

Leave a Reply