
ముంబై, 26 జూన్:
ప్రముఖ స్మార్ట్‌ఫోన్స్, ట్యాబ్లెట్స్ తయారీదారి సంస్థ ఐబాల్ ‘ఇంప్రింట్ 4జీ’ పేరిట ఓ నూతన 4జీ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్‌ను తాజాగా విడుదల చేసింది. ఆకట్టుకునే ఫీచర్లతో విడుదల చేసిన ఈ ట్యాబ్లెట్ రూ.18,999గా ఉంది.
ఆధార్ వెరిఫికేషన్ కోసం ఉపయుక్తంగా ఉండేలా ప్రత్యేకంగా ఈ ట్యాబ్లెట్‌ను తీర్చిదిద్దారు. ఇందులో ఇంటిగ్రేటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. అలాగే ల్యాన్ పోర్టును ఈ ట్యాబ్లెట్ పీసీలో అందిస్తున్నారు. ఇందులో 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ కలదు.
ఐబాల్ ఇంప్రింట్ 4జీ ఫీచర్లు…
- 7 ఇంచ్ ఐపీఎస్ హెచ్డీ డిస్ప్లే
- 1024 x 600 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
- 3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్
- 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్
- 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
- ఆండ్రాయిడ్ 7.0 నూగట్
- 5 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు
- 4జీ వీవోఎల్టీఈ, డ్యుయల్ సిమ్
- యూఎస్బీ ఓటీజీ, బ్లూటూత్ 0
- ల్యాన్ పోర్ట్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ.
మామాట: ధరకి తగ్గట్టుగానే ఫీచర్లు ఉన్నాయి..