Hyderabadi ప్లేయర్ సానియా మీర్జా రీఎంట్రీ అదుర్స్

Share Icons:
భారత ఏస్ టెన్నిస్ క్రీడాకారిణి పునరాగనమం అద్భుతంగా జరిగింది. ఆస్ట్రేలియాలో జరుగుతున్న హోబర్ట్ ఇంటర్నేషనల్ టోర్నీ మహిళల డబుల్స్‌లో శుభారంభం చేసింది. ఉక్రెయిన్ పార్ట్‌నర్ నాదియ కిచినోక్‌తో కలిసి మంగళవారం బరిలోకి దిగిన ఈ హైదరాబాదీ స్టార్ 2-6, 7-6, 10-3తో ఒసాన కలష్నికోవా-మియు కాటోపై అద్భుత విజయం సాధించింది. గంటా 41 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో తొలిసెట్ కోల్పోయిన సానియా జోడీ.. తర్వాతి రెండు సెట్లలో అద్భుత పోరాటం చేసి విజయం సాధించింది.

Read Also :

2017 చైనా ఓపెన్ తర్వాత ఆట నుంచి విరామం తీసుకుని కొడుకుకు జన్మనిచ్చింది. అనంతరం సానియా మంగళవారం తాజాగా బరిలోకి దిగింది. విజయం సాధించిన అనంతరం ట్విట్టర్‌లో తన కుమారునికి హైఫై ఇస్తున్న పిక్‌ను పోస్టు చేసింది. ఈ మ్యాచ్‌కు సానియా తల్లిదండ్రులు హాజరయ్యారు. బుధవారం జరిగే క్వార్టర్స్‌లో వానియా కింగ్-క్రిస్టీనా మెక్‌హాలే జంటతో సానియా జోడీ తలపడనుంది.

Read Also :
మరోవైపు సానియా ప్రతిష్టాత్మక ఫెడ్‌కప్‌కు కూడా ఎంపికైంది. 2016లో చివరిసారి భారత్ తరపున ఆమె ఈ టోర్నీ ఆడింది. మహిళలకు డబుల్స్‌కు సంబంధించి సానియా అగ్రశ్రేణి ప్లేయర్‌గా ఎదిగింది. ఆమె కెరీర్‌లో మూడు మహిళల డబుల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఉన్నాయి. అలాగే మూడు మిక్స్‌డ్ డబుల్స్ టైటిళ్లను కూడా సాధించింది.

Read Also :