TRENDING NOW

ఆ ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ దొరకాలంటే కష్టమే… !

ఆ ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ దొరకాలంటే కష్టమే… !

హైదరాబాద్, 2 జూన్:

అదొక ప్రభుత్వ పాఠశాల…కానీ వసతులు మాత్రం కార్పొరేట్ వాటిని తలదన్నెలా ఉంటాయి. అందుకే ఆ స్కూల్‌లో అడ్మిషన్ దొరకడం కూడా చాలా కష్టం. ఎక్కడైనా ప్రభుత్వ వాటిల్లో అడ్మిషన్ దొరకకుండా ఎందుకు ఉంటుంది. అసలు అంత డిమాండ్ గల ఆ ప్రభుత్వ పాఠశాల ఎక్కడ ఉంది అనుకుంటున్నారా?

అయితే రండీ పేదలకి అందుబాటులో ఉండి కార్పొరేట్  వసతులు గల ఆ ప్రభుత్వ పాఠశాలకి గురించి తెలుసుకుందాం..

Life Homepathy
GCR Infra AD, Maamaata, SEO, Primepagesinfo,
treefurn AD

governor narasimhan and kadiyam srihari

రాజ్‌భవన్ ప్రభుత్వ పాఠశాల..

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని సోమాజిగూడలో రాజ్‌భవన్ ప్రభుత్వ పాఠశాలని 1953లో స్థాపించారు. అయితే అది సంవత్సరాలు గడిచే కొద్ది మరుగున పడుతూ వచ్చింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం దాన్ని సంరక్షిచే పనిలో పడింది. అందులో భాగంగా ఆ పాఠశాలని కార్పొరేట్ స్కూల్స్‌కి ధీటుగా నూతన భవనాన్ని నిర్మించారు. ఇక  గత సంవత్సరం ఆ భవనాలని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరిలు ప్రారంభించారు.

ఆ విద్యా సంవత్సరం నుంచి పూర్తి స్థాయిలో ఇంగ్లీషు మీడియం పాఠశాలగా దీనిని మార్చేశారు.  దాదాపు రూ.4.5కోట్లతో నిర్మించిన మూడు అంతస్తుల ఈ భవనంలో అన్ని వసతులు కల్పించారు.

డైనింగ్ హాల్, బయోమెట్రిక్ మిషన్ల ఏర్పాటు, ఆర్‌ఓ ప్లాంటు, కంప్యూటర్ ల్యాబ్‌లు, సీసీ కెమెరాలు, ఇతర మౌలిక సదుపాయాలు ఇక్కడ ఉన్నాయి.

Hyderabad Rajbhavan Government School

అడ్మిషన్స్ ఫుల్..

ఇది ఇలా ఉండగా శుక్రవారం (జూన్-1) వేసవి సెలవులను పూర్తి చేసుకుని తెలంగాణ రాష్ట్రంలోని పాఠశాలలన్నీ రీ ఓపెన్ అయ్యాయి. ఇక స్కూల్స్ ప్రారంభం అనే వార్త రావడమే ఆలస్యం. విద్యార్ధుల తల్లిదండ్రులు అడ్మిషన్ల కోసం హైదరాబాద్‌లోని రాజ్ భవన్ స్కూల్ వద్ద బారులు తీరారు.

కార్పొరేట్‌కు మించి రాజ్ భవన్ ఉన్నత పాఠశాలలో వసతులు ఉండటంతో పరిసరాల విద్యార్థుల తల్లిదండ్రుల కన్ను ఈ స్కూల్‌పై పడింది. పైగా ఈ సారి పరీక్ష ఫలితాలు కూడా మెరుగ్గా కనిపించాయని చెబుతున్నారు. అయితే ఇప్పటికే అడ్మిషన్లు పూర్తి అయ్యాయని స్కూల్‌ యాజమాన్యం వెల్లడించింది.

దీంతో పాఠశాల ప్రారంభమైన మొదటి రోజునే.. అడ్మిషన్లు ఎలా పూర్తి అవుతాయంటూ తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు.  ప్రైవేట్ స్కూల్స్‌లో వేలకు వేలు ఫీజులు కట్టలేని వారు, ప్రభుత్వ పాఠశాలలే బెటర్ అనుకుంటున్నామని చెప్పారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గవర్నమెంట్ స్కూల్స్ కూడా రాజ్ భవన్ స్కూల్ లాగే తీర్చి దిద్దితే సీఎం కేసీఆర్ కలలు సాకారమవుతాయని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు.

అదండీ రాజ్ భవన్ స్కూల్ కథా..ఇలాంటి ప్రభుత్వ స్కూల్స్ ఉంటే పేద, మధ్య తరగతి ప్రజలకి నిజంగానే మేలు చేకూరుతుంది.

మామాట: కార్పొరేట్ పాఠశాలలకి గట్టి పోటీ ఇస్తున్న రాజ్ భవన్ స్కూల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: