హైదరాబాద్, 10 సెప్టెంబర్:
హైదరాబాద్‌లోని గోకుల్‌ఛాట్, లుంబిని పార్క్ పేలుళ్ల కేసులో ఇద్దరు నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ కోర్టు ఈరోజు తీర్పు ఇచ్చింది. అక్బర్ ఇస్మాయిల్, అనీఖ్ షఫిక్ అహ్మద్‌లను దోషులుగా ఈ నెల 4వ తేదీనే నిర్ధారించింది. ఈ కేసులో వీరిద్దరికీ ఈరోజు శిక్షను ఖరారు చేసింది.
ఇక ఆధారాలు లేవంటూ మరో ఇద్దరిపై కేసులను కోర్టు కొట్టివేసింది. అలాగే ఈ కేసులో తారిఖ్ అంజూమ్‌ను కూడా కోర్టు దోషిగా తేల్చింది. తారిఖ్ ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించినట్లు కోర్టు స్పష్టం చేసింది.
కాగా, 2007 ఆగష్టు 25వ, తేదీ రాత్రి 7.45 నిమిషాల సమయంలో తొలుత లుంబిని పార్క్‌లో, ఆ తర్వాత గోకుల్ చాట్‌లో పేలుళ్లు చోటు చేసుకొన్నాయి. ఈ ఘటనల్లో సుమారు 42మంది మృతి చెందగా, మరో 50 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు ఇండియన్ ముజాహిద్దీన్ కారణంగా ఎన్ఐఏ నిర్దారించింది.
ఈ కేసులో నిందితులైన అక్బర్, అనీఖ్, అన్సార్‌ను పోలీసులు 2008 అక్టోబర్‌లో ముంబై పోలీసులు అరెస్టు చేశారు. 2009లో హైదరాబాద్‌కు తీసుకువచ్చి ఇక్కడి కోర్టులో హాజరుపరిచారు. పేలుళ్లు జరిపింది తామేనని వారు అంగీకరించారు. ఈ కేసులో నిందితులైన రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్, ఫరూఖ్ ఫార్పూద్దిన్, అమీర్ రసూల్ ఖాన్. రియాజ్, ఇక్బాల్, ఫరూఖ్ పార్పూద్దిన్, అమీర్ రసూల్ ఖాన్ పరారీలో ఉన్నారు.
మామాట: ఎట్టకేలకు శిక్ష ఖరారు అయింది….