హుజూర్ నగర్ లో డిపాజిట్లు కోల్పోనున్న టీడీపీ-బీజేపీ

huzur nagar by poll....tdp, bjp effect in election result
Share Icons:

హైదరాబాద్: తెలంగాణలో హుజూర్ నగర్ ఉప ఎన్నిక ప్రశాంతంగా జరిగింది. సోమవారం పెద్ద ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అయితే ఈ ఉప ఎన్నిక ఫలితం 24న వెలువడనుంది. ఉపఎన్నికలో గెలుపుపై అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు ధీమాగా ఉన్నాయి. గెలుపు మాదంటే మాది అని ప్రకటనలు చేసేస్తున్నారు. 85 శాతం పోలింగ్ నమోదైన హుజూర్ నగర్ ఉప ఎన్నికలో ఎగ్జిట్ పోల్స్ ఆన్ని టీఆర్ఎస్ దే హవా అని చెబుతున్నాయి.  పలు సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ గులాబీకే పట్టం కట్టడంతో ఆ పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

ఇక కాంగ్రెస్ పార్టీ రెండో స్థానానికి పరిమితం కాగా, టీడీపీ, బీజేపీలు డిపాజిట్లు కోల్పోనున్నాయి. హుజూర్ నగర్ లో మొత్తం ఓటర్లు 2,36,842 ఉండగా.. 2,00,726 ఓట్లు పోలయ్యాయి. అయితే పోలైన ఓట్లలో 1/6 వంతు ఓట్లు వస్తే డిపాజిట్ దక్కుతుంది. అంటే బీజేపీ-టీడీపీలకు ఆ ఓట్లు కూడా రావు. రాష్ట్రవ్యాప్తంగా పలు సంస్థలు ఎగ్జిట్‌ పోల్స్‌ నిర్వహించగా.. అన్ని ఫలితాలూ అధికార టీఆర్‌ఎస్ కు అనుకూలంగానే ఉన్నాయి.

చాణక్య ఎగ్జిట్‌ పోల్‌లో టీఆర్‌ఎస్ కు 53 శాతం, కాంగ్రెస్ కు 41 శాతం, టీడీపీకి 2.1 శాతం, బీజేపీకి 1.1 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. అటు ‘ఆరా’ అనే ఏజెన్సీ చేసిన సర్వేలో టీఆర్‌ఎస్ కు 50.48 శాతం, కాంగ్రెస్ కు 39.95 శాతం, ఇతరులకు 9.57 శాతం ఓట్లు పోల్‌ అవుతాయని పేర్కొంది. ‘వీసీపీ’ అనే సంస్థ టీఆర్‌ఎస్ కు 57.73 శాతం, కాంగ్రెస్ కు 41.04 శాతం, టీడీపీకి 2.21 శాతం, బీజేపీకి 1.17 శాతం, ఇతరులకు 1.84 శాతం ఓట్లు వస్తాయని తెలిపింది. రిసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ బై పబ్లిక్‌ పల్స్‌ అనే సంస్థ టీఆర్‌ఎస్ కు 49.3%, కాంగ్రెస్ కు 41.8%, టీడీపీకి 4.8%, బీజేపీకి 2.4%, ఇతరులకు 1.7% వస్తాయని పేర్కొంది.

ఈ ఎగ్జిట్ పోల్స్ బట్టి చూస్తే టీఆర్ఎస్ విజయం ఖాయమని అర్ధమవుతుండగా, కాంగ్రెస్ రెండో స్థానానికి పరిమితం కానుంది. ఇక టీడీపీ, బీజేపీలో డిపాజిట్లు కోల్పోనున్నాయి.

Leave a Reply