హుజూర్ నగర్ ప్రచారానికి నేటితో ముగింపు…గెలుపు ముంగిట ఉన్నది ఎవరు?

huzurnagar by election ticket fight in congress and trs
Share Icons:

హైదరాబాద్: అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హుజూర్ నగర్ ఉప ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. గత కొన్ని రోజులుగా ప్రధాన పార్టీలన్నీ హోరాహోరీగా ప్రచారం చేశారు. ఇక హుజూర్ నగర్ ఉప ఎన్నిక అక్టోబర్ 21న జరగనుండగా, 24న ఫలితాలు వెలువడనున్నాయి. అయితే ఈ పోటీలో కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ, పలువురు ఇండిపెండెంట్లుఉన్నారు. కానీ ప్రధాన పోరు మాత్రం కాంగ్రెస్, టీఆర్ఎస్ ల మధ్యే జరగనుంది.

కాంగ్రెస్ తరుపున ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి పోటీ చేస్తుండగా, టీఆర్ఎస్ తరుపున సైదిరెడ్డి పోటీ చేస్తున్నారు.  కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి గెలుపు కోసం… కాంగ్రెస్ ఉద్ధండులంతా ప్రచారం సాగించారు. కాంగ్రెస్ తిరిగి గెలుస్తుందనేందుకు హుజూర్‌నగర్‌లో జరిగిన అభివృద్ధే నిదర్శనం అని వారంతా గొప్పగా చెబుతున్నారు. అటు టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి కాంగ్రెస్‌పై విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ పని అయిపోయింది కాబట్టే… ఆ పార్టీ నేతలంతా టీఆర్ఎస్‌లో చేరుతున్నారనీ, అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటే… నియోజకవర్గ అభివృద్ధికి అది మేలు చేస్తుందని అంటున్నారు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇరు పార్టీలకు గెలుపు అవకాశాలు సమానంగానే ఉన్నట్లు కనిపిస్తున్నాయి. సాధారణంగాఉపఎన్నికల్లో అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ హుజూర్ నగర్ కాంగ్రెస్ కంచుకోట కావడం, ప్రస్తుతం టీఆర్ఎస్ పై ప్రజల్లో కొంత వ్యతిరేకిత ఉండటం, అలాగే ఆర్టీసీ సమ్మె జరగడం టీఆర్ఎస్ కు ఇబ్బంది కలిగించే అంశాలు. అయితే అధికారంలో ఉండటం, అభివృద్ధి చేస్తామని హామీ ఉండటం కలిసొచ్చే అంశాలు.

ఇక తమ కంచుకోట కావడం, గత పదేళ్లుగా ఉత్తమ్ అభివృద్ధి చేయడం కాంగ్రెస్ కు ప్లస్ పాయింట్స్ గా ఉన్నాయి. అటు టీడీపీ, బీజేపీలు ఇక్కడ డిపాజిట్లు దక్కించుకోవడం గొప్పే.

అటు మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కూడా ఇవాళే ముగియనుంది. అక్కడ కూడా సోమవారం ఎన్నికలు జరగనుండగా… అక్టోబర్ 24న ఫలితాలు రానున్నాయి. ఆ రెండు రాష్ట్రాల్లో తిరిగి గెలిచేందుకు బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతుండగా… లోక్‌సభ ఎన్నికల్లో చతికిలపడిన కాంగ్రెస్… ఈ రెండు రాష్ట్రాల్లో గెలుపు కోసం అనుకున్న స్థాయిలో పోరాడలేదనే చెప్పాలి.

Leave a Reply