నాలుగు కెమెరాలతో హువాయి కొత్త ఫోన్….

Share Icons:

ఢిల్లీ, 2 సెప్టెంబర్:

స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో అగ్రగామిగా దూసుకుపోతున్న చైనాకి చెందిన మొబైల్స్ తయారీ సంస్థ హువాయి తన నూతన స్మార్ట్‌ఫోన్ ‘హువాయి మేట్ 20 లైట్‌’‌ని తాజాగా విడుదల చేసింది. నాలుగు కెమెరాలతో వస్తున్న ఈ ఫోన్‌ని బెర్లిన్‌లో జరిగిన ‘ఐఎఫ్‌ఏ 2018’ కార్యక్రమంలో లాంచ్ చేసింది.

ఇక ఇందులో హైసిలికాన్ కిరిన్ 710 లాంటి అధునాతన ప్రాసెసర్‌ తో పాటు 4 జీబీ ర్యామ్‌ని ఈ ఫోన్లో ఏర్పాటు చేశారు. గోల్డ్, బ్లాక్, బ్లూ కలర్ లలో లభించే ఈ ఫోన్ త్వరలోనే భారత మార్కెట్లోకి రానుంది. ఇక భారత్‌లో దీని ధర సుమారు రూ. 34 వేల వరకు ఉండొచ్చని తెలుస్తోంది.

హువాయి మేట్ 20 లైట్‌ ఫీచర్లు..

6.3″ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే(19.5:9)

2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

హైసిలికాన్ కిరిన్ 710 ప్రాసెసర్

4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ( 256 జీబీ వరకు పెంచుకునే సామర్ధ్యం)

ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం

20/2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు,

24/2 మెగాపిక్సల్ డ్యుయల్ ఫ్రంట్ కెమెరాలు

ఫింగర్‌ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ

3750ఎంఏహెచ్ బ్యాటరీ

మామాట: అదిరిపోయే ఫీచర్లే ఉన్నాయి…

Leave a Reply