భారత్‌లోకి వచ్చేసిన హానర్ 8ఎక్స్…

huawei released honor8x in india
Share Icons:

ఢిల్లీ, 16 అక్టోబర్:

చైనాకి చెందిన ప్రముఖ మొబైల్స్ తయారీదారు హువాయి తన నూతన స్మార్ట్‌ఫోన్ హానర్ 8ఎక్స్‌ను ఈరోజు భారత మార్కెట్‌లో విడుదల చేసింది. హానర్ 8ఎక్స్ స్మార్ట్‌ఫోన్ బ్లాక్, బ్లూ కలర్ మోడల్స్‌లో విడుదలవ్వగా, ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్‌ను రూ.14,999 ధరకు అందిస్తున్నారు. అలాగే 6జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.16,999 ధరకు, 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.18,999 ధరకు లభిస్తున్నాయి. ఇక ఈ నెల 24వ తేదీ నుంచి అమెజాన్ సైట్‌లో ఈ ఫోన్‌ను ప్రత్యేకంగా విక్రయించనున్నారు.

హానర్ 8ఎక్స్ ఫీచర్లు…

6.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే

2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

ఆక్టాకోర్ ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్

64/128 జీబీ స్టోరేజ్, 400 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్

ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్

20, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు

16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫేస్ అన్‌లాక్

ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ

డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 3750 ఎంఏహెచ్ బ్యాటరీ

మామాట: ధరకి తగిన ఫీచర్లు….

Leave a Reply