బడ్జెట్ ధరలో విడుదలైన హానర్ 8సి…

huawei released honor 8c smartphone
Share Icons:

ఢిల్లీ, 30 నవంబర్:

చైనాకి చెందిన దిగ్గజ మొబైల్స్ తయారీదారు హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్ హానర్ 8సి ని తాజాగా భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఇందులో 6.26 ఇంచుల భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. హానర్ 8సి స్మార్ట్‌ఫోన్ అరోరా బ్లూ, మిడ్‌నైట్ బ్లాక్ కలర్ వేరియెంట్లలో విడుదల కాగా ఈ ఫోన్‌కు చెందిన 4జీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ మోడల్‌ను రూ.11,999 ధరకు, 64 జీబీ స్టోరేజ్ మోడల్‌ను రూ.12,999 ధరకు విక్రయిస్తున్నారు.

ఇక ఈ ఫోన్ అమెజాన్ సైట్‌లో డిసెంబర్ 10 నుంచి లభ్యం కానుంది. ఈ ఫోన్‌ను కొన్న కస్టమర్లకు జియో రూ.4450 విలువైన 100 జీబీ డేటాను ఉచితంగా అందివ్వనుంది.

హానర్ 8సి ఫీచర్లు…

6.26 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే

1520 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్

1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 632 ప్రాసెసర్

4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్.

డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో

13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు

8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్

 డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

మామాట: బడ్జెట్ ధరలో మంచి ఫీచర్లే ఉన్నాయి..

Leave a Reply