అందుబాటులో ధరలో హువావే ఎంజాయ్‌ 10ఇ…

Share Icons:

ఢిల్లీ: ప్రముఖ మొబైల్స్‌ తయారీదారు హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్‌ ఎంజాయ్‌ 10ఇ ని చైనా మార్కెట్‌లో విడుదల చేసింది. త్వరలో ఇది ఇండియాలో కూడా విడుదల కానుంది.  రూ.10,309 ప్రారంభ ధరకు ఈ ఫోన్‌ వినియోగదారులకు లభ్యం కానుంది. ఇందులో.. 6.3 ఇంచుల డిస్‌ప్లే, 1600 x 720 పిక్సల్స్‌ స్క్రీన్‌ రిజల్యూషన్‌, ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ హీలియో పి35 ప్రాసెసర్‌, 4జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండబుల్‌ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్‌ 10, హైబ్రిడ్‌ డ్యుయల్‌ సిమ్‌, 13, 2 మెగాపిక్సల్‌ డ్యుయల్‌ బ్యాక్‌ కెమెరాలు, 8 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమెరా, డ్యుయల్‌ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్‌ 5.0, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఫాస్ట్‌ చార్జింగ్‌.. తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

ఒప్పో.. ఎన్‌కో ఫ్రీ

మొబైల్స్‌ తయారీదారు ఒప్పో.. ఎన్‌కో ఫ్రీ పేరిట నూతన వైర్‌లెస్‌ ఇయర్‌బడ్స్‌ను భారత్‌లో తాజాగా విడుదల చేసింది. రూ.7,990 ధరకు ఈ ఇయర్‌బడ్స్‌ వినియోగదారులకు అమెజాన్‌లో మార్చి 4వ తేదీ నుంచి లభ్యం కానున్నాయి. వీటిలో 13.44 ఎంఎం డ్రైవర్స్‌ను అందిస్తున్నారు. అందువల్ల ఇవి అద్భుతమైన సౌండ్‌ క్వాలిటీని ఇస్తాయి. బ్లూటూత్‌ 5.0 ద్వారా ఇవి ఫోన్లకు కనెక్ట్‌ అవుతాయి. వీటికి ఐపీఎక్స్‌4 స్వెట్‌, వాటర్‌ రెసిస్టెన్స్‌ను అందిస్తున్నారు. ఇవి 5 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తాయి. అదే చార్జింగ్‌ కేస్‌తో అయితే 25 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తాయి. యూఎస్‌బీ టైప్‌ సి పోర్టు ద్వారా వీటిని చార్జింగ్‌ చేసుకోవచ్చు.

ఫాల్‌స్టర్‌ 3 స్మార్ట్‌వాచ్‌

స్కాజెన్‌ కంపెనీ ఫాల్‌స్టర్‌ 3పేరిట ఓ నూతన ఆండ్రాయిడ్‌ వియర్‌ ఓఎస్‌ స్మార్ట్‌వాచ్‌ను భారత్‌లో విడుదల చేసింది. రూ.21,995 ధరకు ఈ వాచ్‌ను వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. ఇందులో గూగుల్‌కు చెందిన ఆండ్రాయిడ్‌ వియర్‌ ఓఎస్‌ను ఏర్పాటు చేశారు. జీపీఎస్‌, వాటర్‌ప్రూఫ్‌, 1.3 ఇంచ్‌ రౌండ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్‌ వియర్‌ 3100 ప్లాట్‌ఫాం, 1జీబీ ర్యామ్‌, 8జీబీ స్టోరేజ్‌ తదితర ఫీచర్లను ఈ వాచ్‌లో అందిస్తున్నారు. ఇందులో గూగుల్‌ అసిస్టెంట్‌కు సపోర్ట్‌ను అందిస్తున్నారు. అలాగే గూగుల్‌ ట్రాన్స్‌లేట్‌ ఫీచర్‌ను కూడా ఈ వాచ్‌లో ఉపయోగించుకోవచ్చు. బ్లూటూత్‌, వైఫై కనెక్టివిటీ, హార్ట్‌ రేట్‌ ట్రాకింగ్‌, ఎన్‌ఎఫ్‌సీ, ర్యాపిడ్‌ చార్జింగ్‌ ఫీచర్లను కూడా ఇందులో అందిస్తున్నారు. ఈ వాచ్‌ 24 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తుంది.

 

Leave a Reply