ముంబై: చైనాకు చెందిన మొబైల్ కంపెనీ హువావే తన వినియోగదారుల కోసం సాధారణ బడ్జెట్ ఫోన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆకట్టుకునే ఫీచర్లతో ఇవి వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. హువావే ఎంజాయ్ 10ఈ పేరుతో కొనుగోలు చేసుకోవచ్చు. 3జీబీ ర్యామ్ /64 జీబీ ధర సుమారు రూ.10,309 ఉండగా, 4జీబీర్యామ్/128 జీబీ స్టోరేజ్ ధర సుమారు రూ.12,375.
ఎంజాయ్ 10ఈ ఫీచర్లు
డిస్ప్లే : 6.3 అంగుళాలు
రిజల్యూషన్ : 600 x 720 పిక్సెల్స్
ప్రాసెసర్ : ఆక్టాకోర్ మీడియాటెక్ , హీలియో పీ35
ఓఎస్ : ఆండ్రాయిడ్ 10
స్టోరేజీ : 64/128 జీబీ స్టోరేజ్
ర్యామ్ : 4జీబీ
కెమెరా : 13+2 ఎంపీ
ఫ్రంట్ కెమెరా : 8 ఎంపీ
బ్యాటరీ : 5000 ఎంఏహెచ్
ఫైండ్ ఎక్స్2 స్మార్ట్‌వాచ్
ఒప్పో కొత్త స్మార్ట్‌వాచ్ ఆకట్టుకుంటున్నది. ఇటీవల చైనాలో ‘ఫైండ్ ఎక్స్2 లాంచ్ ఈవెంట్లోనే ఆ కంపెనీ దీన్ని విడుదల చేసింది. ఒప్పో బ్రాండ్ నుంచి మొట్టమొదటిసారిగా స్మార్ట్‌వాచ్ మార్కెట్లోకి వచ్చింది. స్యామ్సంగ్ గెలాక్సీ వాచ్ యాక్టివ్ 2 గాడ్జెట్‌కు పోటీగా ఒప్పో ఈ స్మార్ట్‌వాచ్ ఇప్పుడు ఆకర్షిస్తున్నది. ఇది చూడటానికి అచ్చం Apple Watch Series 4 మాదిరిగానే కనిపిస్తోంది. ఫీచర్లలో అమోలెడ్ డిస్ప్లే, VOOC చార్జింగ్ టెక్నాలజీ, ECG సెన్సార్ బోర్డు ఉంది. ఒకసారి చార్జ్ చేస్తే సాధారణ వాడకంపై 40 గంటల బ్యాటరీ లైఫ్ కలిగి ఉంది. బ్యాటరీ సేవింగ్ మోడ్ ద్వారా 21 రోజుల వరకు బ్యాటరీ చార్జింగ్ వస్తుంది.
వైర్లెస్ హెడ్ఫోన్లు
చైనా కంపెనీ లెనోవా నుంచి వైర్లెస్ హెడ్ఫోన్లు విడుదలయ్యాయి. సరికొత్త ఐక్యూ టెక్నాలజీతో ‘హెచ్డి 116’ పేరుతో ఇవి అందుబాటులో ఉన్నాయి. మంచి లుక్, సౌండ్ అవుట్‌పుట్, బ్లూటూత్ కనెక్టివిటీ లాంటి క్లాసిక్ ఫీచర్లను కలిగి ఉన్నాయి. దీంతో పాటు డ్యూయల్ ఐక్యూ మోడ్, 240హెచ్ స్టాండ్‌బై బ్యాటరీ సామర్థ్యం ఉంది. ఒకసారి చార్జ్ చేస్తే 24 గంటలు పని చేస్తుంది. 2019లో తమ ఆడియో పరికరాలకు ఇండియా నుంచి వచ్చిన విశేష ఆదరణ నేపథ్యంలో ఐక్యూ టెక్నాలజీతో అప్‌గ్రేడ్ వెర్షన్‌ను తీసుకొచ్చినట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఇవి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో లభ్యమవుతుందని కంపెనీ తెలిపింది. దీని ధర రూ .2,499.