హువావే నుంచి మడతబెట్టే ఫోన్…రెండు డిస్‌ప్లేలు…

Share Icons:

ముంబై: చైనాకు చెందిన మొబైల్స్‌ తయారీదారు హువావే.. మేట్‌ ఎక్స్‌ఎస్‌ పేరిట మరో మడతబెట్టే స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఇందులో 6.6, 6.38 ఇంచుల సైజ్‌ కలిగిన రెండు డిస్‌ప్లేలు ముందు వెనుక భాగాల్లో ఉన్నాయి. ఇక ఈ రెండు డిస్‌ప్లేలు మడతబెట్టబడి ఉంటాయి. వీటిని ఓపెన్‌ చేస్తే ఒకటే డిస్‌ప్లేగా మారుతాయి. దాని సైజ్‌ 8 ఇంచులుగా ఉంటుంది. ఇక ఈ ఫోన్‌లో పలు ఆకట్టుకునే ఫీచర్లను ఏర్పాటు చేశారు.

హువావే మేట్‌ ఎక్స్‌ఎస్‌ స్మార్ట్‌ఫోన్‌లో అధునాతన కైరిన్‌ 990 5జి ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. ఇక ఈ ఫోన్‌కు వెనుక భాగంలో 40, 16, 8 మెగాపిక్సల్‌ కెమెరాలతోపాటు మరో డెప్త్‌ సెన్సార్‌ను కూడా అందిస్తున్నారు. వీటితో సెల్ఫీలు కూడా తీసుకునేందుకు వీలు కల్పించారు. కాగా ఈ ఫోన్‌ ధర 2706 డాలర్లు (దాదాపుగా రూ.1,95,245)గా ఉంది. దీన్ని మార్చి నెల మొదటి వారంలో ప్రపంచ వ్యాప్తంగా విక్రయించనున్నారు.

హువావే మేట్‌ ఎక్స్‌ఎస్‌ ఫీచర్లు…

6.6 ఇంచుల ఓలెడ్‌ డిస్‌ప్లే, 2480 x 1148 పిక్సల్స్‌ స్క్రీన్‌ రిజల్యూషన్‌

6.38 ఇంచుల ఓలెడ్‌ డిస్‌ప్లే, 2480 x 892 పిక్సల్స్‌ స్క్రీన్‌ రిజల్యూషన్‌

8 ఇంచుల ఓలెడ్‌ డిస్‌ప్లే, 2480 x 2200 పిక్సల్స్‌ స్క్రీన్‌ రిజల్యూషన్‌

హువావే కైరిన్‌ 990 5జి ప్రాసెసర్‌, 8జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్‌

256 జీబీ ఎక్స్‌పాండబుల్‌ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్‌ 10, హైబ్రిడ్‌ డ్యుయల్‌ సిమ్‌

40, 16, 8 మెగాపిక్సల్‌ కెమెరాలు, డెప్త్‌ సెన్సార్‌

సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, 5జి, డ్యుయల్‌ 4జీ వీవోఎల్‌టీఈ

బ్లూటూత్‌ 5.0 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్‌ సి

4500 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 55 వాట్ల సూపర్‌ చార్జ్‌

హానర్‌ వ్యూ30 ప్రొ

మొబైల్స్‌ తయారీదారు హువావే తన నూతన స్మార్ట్‌ఫోన్‌ హానర్‌ వ్యూ30 ప్రొను విడుదల చేసింది. కాగా ఈ ఫోన్ ధ‌ర వివ‌రాల‌ను ఇంకా వెల్ల‌డించ‌లేదు. మార్చిలో ఈ ఫోన్‌ను విక్ర‌యించ‌నున్నారు. ఈ ఫోన్‌లో కైరిన్‌ 990 5జి ప్రాసెసర్‌ను అందిస్తున్నారు. వెనుక భాగంలో 40, 12, 8 మెగాపిక్సల్‌ కెమెరాలు ఉన్నాయి. ఆండ్రాయిడ్‌ 10ఓఎస్‌ను ఇందులో అందిస్తున్నారు. ఈ ఫోన్‌లో ఉన్న 4100 ఎంఏహెచ్‌ బ్యాటరీకి 40 వాట్ల సూపర్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌ ఫీచర్‌ను అందిస్తున్నారు. అందువల్ల ఫోన్‌ను కేవలం 30 నిమిషాల్లోనే 0 నుంచి 70 శాతం వరకు చార్జింగ్‌ చేసుకోవచ్చు.

హానర్‌ వ్యూ 30 ప్రొ ఫీచర్లు…

6.57 ఇంచ్‌ ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే

2400 x 1080 పిక్సల్స్‌ స్క్రీన్‌ రిజల్యూషన్‌

కైరిన్‌ 990 5జి ప్రాసెసర్‌, 8జీబీ ర్యామ్‌

128/256 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్‌ 10

డ్యుయల్‌ సిమ్‌, 40, 12, 8 మెగాపిక్సల్‌ బ్యాక్‌ కెమెరాలు

32, 8 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ కెమెరాలు

సైండ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌, 5జి

డ్యుయల్‌ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్‌ 5.1, ఎన్‌ఎఫ్‌సీ

యూఎస్‌బీ టైప్‌ సి, 4100 ఎంఏహెచ్‌ బ్యాటరీ

సూపర్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌, వైర్‌లెస్‌ రివర్స్‌ చార్జింగ్‌

 

Leave a Reply