ఆకర్షణీయమైన ఫీచర్లతో హెచ్‌పీ క్రోమ్‌బుక్ ట్యాబ్లెట్ పీసీ

hp launches chrome book x 360 in india
Share Icons:

ముంబై:

 

దిగ్గజ కంప్యూటర్ ఉత్పత్తుల తయారీదారు హెచ్‌పీ తన కొత్త క్రోమ్‌బుక్ ఎక్స్360ని తాజాగా భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ క్రోమ్‌బుక్‌ను ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్ పీసీగా కూడా ఉపయోగించుకోవచ్చు. కాగా ఈ క్రోమ్‌బుక్‌కు చెందిన ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్ వేరియెంట్ ధర రూ.44,990 ఉండగా, కోర్ ఐ5 మోడల్ ధర రూ.52,990గా ఉంది. అతి త్వరలోనే ఈ క్రోమ్‌బుక్ అన్ని ఆన్‌లైన్ స్టోర్స్‌తోపాటు పలు ఆఫ్‌లైన్ స్టోర్స్‌లోనూ విక్రయించనున్నారు.

 

ఇందులో 14 ఇంచుల డిస్‌ప్లే, ఇంటెల్ కోర్ ఐ5 8వ జనరేషన్ ప్రాసెసర్, ఇంటెల్ అల్ట్రాహెచ్‌డీ గ్రాఫిక్స్, 8 జీబీ డీడీఆర్4 ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, హెచ్‌డీ వెబ్ కెమెరా, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, యూఎస్‌బీ టైప్ సి తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

 

ఇక ప్రముఖ మొబైల్స్ తయారీదారు హానర్ బ్యాండ్ 5 పేరిట హువావే ఓ నూతన స్మార్ట్‌బ్యాండ్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఇందులో 0.95 ఇంచ్ అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్‌ను అందిస్తున్నారు. రన్నింగ్ సైక్లింగ్, స్విమ్మింగ్ వంటి పలు యాక్టివిటీలను ఈ బ్యాండ్ ట్రాక్ చేస్తుంది. అలాగే స్లీప్ మానిటర్, ఎస్‌పీవో2 సెన్సార్, హార్ట్ రేట్ సెన్సార్‌లను ఈ బ్యాండ్‌లో అందిస్తున్నారు. బ్లూటూత్ 4.2 ద్వారా ఈ బ్యాండ్‌ను ఇతర డివైస్‌లకు కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ బ్యాండ్‌లో 100 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాటరీ ఉన్నందున ఈ బ్యాండ్ 14 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తుంది. రూ.2599 ధరకు ఈ బ్యాండ్ వినియోగదారులకు ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో లభిస్తున్నది.

Leave a Reply