మన ఊపిరితిత్తుల శుభ్రత మన చేతుల్లోనే…

how to purify lungs naturally
Share Icons:

హైదరాబాద్:

ఆహారం తీసుకోకుండా కొన్ని రోజులు బ్రతకగలం, నీరు తాగకుండా కొన్ని గంటలు బ్రతకగలం. మరి గాలి పీల్చకుండా గడియ కూడా గడపలేం కదా.. క్షణాల్లోనే ఊపిరి పోతుంది. అందుకే ఎంత ఆపాలని ప్రయత్నించినా గాలి పీల్చకుండా ఉండలేం.

 గాలి పీలుస్తున్నాం అంటే సరికాదు. మనం పీల్చుకునే గాలి స్వచ్ఛమైనది అయ్యి ఉండాలి. కానీ, నేటి వాతావరణ పరిస్థితుల్లో నిత్యం పెరుగుతున్న కాలుష్యాల్లో స్వచ్చమైన గాలి ఎక్కడ నుండి వస్తుంది? వచ్చినా అది మనని చేరే లోపే కలుషితమైపోతుంది. అటువంటి గాలి పీల్చడం వల్ల ఊపిరితిత్తులు కూడా దెబ్బ తింటున్నాయి.

కలుషితమైన గాలి వల్లే కాదు. ధూమ పానం, మద్య పానం వలన కూడా ఊపిరితిత్తులో చాలా రకాల సమస్యలు వస్తున్నాయి. ఎన్నో రకాల వ్యర్ధాలు ఊపిరితిత్తులో పెరుకుపోయి గాలి పీల్చినా గ్రహించలేని స్థితికి వచ్చేస్తున్నాయి. తద్వారా కాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చేస్తున్నాయి. కాబట్టి ఊపిరితిత్తులు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి. అది కూడా మన చేతుల్లో పనే. మనం కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు ఊపిరితిత్తులు ఎప్పటికప్పుడు శుద్దంగా ఉంటాయి. మరి ఆ చిట్కాలేమిటో తెలుసుకుందామా..

ఊపిరితిత్తులను శుభ్రపరిచే చిట్కాలు..

నిమ్మరసంతో శుద్ది..

ప్రతి రోజూ ఉదయం లేవగానే పరగడుపున ఒక గ్లాసుడు గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగడం వలన ఊపిరితిత్తుల్లోని మలినాలు తొలగిపోతాయి. మంచిగా శుభ్ర పడతాయి.

అల్లంతో విష పదార్ధాలకు చెక్..

అల్లం రసం విష పదార్ధాలను బయటకి పంపడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ప్రతి రోజూ ఉదయాన్నే కొద్దిగా అల్లం రసం తాగితే చాలు.. ఊపితిత్తుల్లోకి చేరిన విష పదార్ధాలన్నీ మటుమాయం అవుతాయి.

పుదీనాతో పరిశుభ్రం..

రోజూ ఉదయం మొహం కడుక్కోగానే 4 లేదా 5 పుదీనా ఆకులు నమిలి మింగడం వలన ఊపిరితిత్తులు పరిశుభ్రం అవుతాయి. అంతే కాకుండా శ్వాస తీసుకోవడం కూడా సులువుగా అవుతుంది.

వ్యర్ధాలను బయటకి పంపే గ్రీన్ టీ..

గ్రీన్ టీ వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలుసు. కానీ, ఊరితిత్తులు కూడా శుభ్రం అవుతాయని మీకు తెలుసా? అవును నిజమే. రోజులో 2-3 కప్పుల గ్రీన్ టీ తాగే వారిలో ఊపిరితిత్తుల్లో ఉండే వ్యర్ధ పదార్ధాలు తక్షణమే బయటకి వచ్చేస్తాయి.

క్లీనింగ్‌లో క్యారెట్ జ్యూస్…

క్యారెట్ జ్యూస్ తాగడం వలన మంచి రక్తం పడటమే కాదు ఊపిరితిత్తులు కూడా శుభ్రం అవుతాయి. ప్రతి రోజూ పరగడుపున, మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి అర గంట ముందు ఒక గ్లాసుడు క్యారెట్ జ్యూస్ తాగితే ఊపితిత్తులు శుభ్రమవుతాయి.

ఆహారంలో పొటాషియం ఉండాలి..

ప్రతి రోజూ మనం తీసుకునే ఆహారంలో పొటాషియం ఎక్కువగా ఉన్న ఆహారపదార్ధాలు తీసుకోవాలి. బొప్పాయి, దానిమ్మ, అరటి పండ్లు, కమలాలు, కంద దుంపలు, ఆలు గడ్డలు, క్యాబేజీ, క్యారెట్లు వంటి వాటిని ప్రతి రోజూ తీసుకోవడం వలన పొటాషియం ఎక్కువగా లభిస్తుంది. తద్వారా ఊపిరితిత్తులు ఎల్లప్పుడూపరిశుభ్రంగా ఉంటాయి.

మామాట: స్వయం కృతాపరాధలను స్వయం కృషితోనే మాఫీ చేసుకోండీ…

Leave a Reply