TRENDING NOW

కిం కర్తవ్యం.? ఊహించని పరిణామంతో ఖంగుతిన్న కాంగ్రెస్

కిం కర్తవ్యం.? ఊహించని పరిణామంతో ఖంగుతిన్న కాంగ్రెస్
views:
18

ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేద్దామా?

కోర్టుకెళ్లి న్యాయ పోరాటం చేద్దామా?

శాసనసభను బహిష్కరిద్దామా?

తిరుపతి, మార్చి 13 :

నిన్నటి దాకా బస్సుయాత్రతో తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు ముచ్చెమటలు పట్టించిన కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీ సంఘటనతో డోలామానంలో పడిపోయారు. సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. అవకాశం కోసం ఎదురు చూసిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రధాన నాయకులందరినీ ఎత్తి శాసనసభ బయటేసింది. తెలంగాణలో ఇవన్నీ అనూహ్య రాజకీయ పరిణామాలే.

శాసనసభలో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడంలో భాగంగా కోమటి రెడ్డి వెంకట రెడ్డి తన వద్దనున్న హెడ్ ఫోన్స్‌ను విసిరి వేశారు. విసరడమైతే కనిపించింది కానీ, ఎవరికి తగిలాయో కూడా తెలియదు. కానీ, తన కంటికి గాయమయ్యిందని, శాసనమండలి ఛైర్మన్ స్వామి గౌడ్‌ను ఆసుపత్రికి తరలించారు. అంతవరకూ పక్కా ప్రణాళికతో ఉన్న కాంగ్రెస్‌పై టీఆర్ఎస్ పైచేయి సాధించింది. దాడి చేయడం ప్రజాస్వామ్య విరుద్దమంటూ ఏకంగా సిఎల్పీ లీడర్, డిప్యూటీ లీడర్, పీసీసీ అధ్యక్షుడు, మండలిలో ప్రతిపక్షనేతతో సహా 11 మందిపై వేటు వేసింది. వారిని శాసనసభా సమావేశాలు పూర్తిగా సస్పెండ్ చేసింది. సస్పెండు అయిన వారిలో అందరూ ప్రముఖ నాయకులే. కోమటిరెడ్డి, సంపత్ విషయంలో మరీ కఠినంగా శాసనసభ సభ్యత్వాలనే రద్దు చేయించింది.

వాస్తవానికి బస్సు యాత్రను అర్ధాంతరంగా రద్దు చేసుకుని కాంగ్రెస్ నాయకులు బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యారు. అవసరమనుకుంటే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ప్రభుత్వాన్ని ఇరుకపెట్టాలని అనుకున్నారు. అయితే సమావేశాల మొదటి రోజే సెల్ఫ్ గోల్ చేసుకుని పూర్తి ఆత్మరక్షణలో పడిపోయారు. ఇలాంటి స్థితిలో కాంగ్రెస్ ఏం చేయాలి? ఇది కాంగ్రెస్ పార్టీ ఎదుట ఉన్న పెద్ద ప్రశ్నగా మారింది. తమ సస్పెన్షన్‌పై కోర్టుకెళ్లి న్యాయపోరాటం చేస్తే ఎలా ఉంటుంది.? అది ఎప్పటికి తెగేది? తిరిగి ఏం విధమైన లంకెపెడతారో.? ఆంధ్ర్రప్రదేశ్‌లో నగిరి ఎమ్మెల్యే రోజా కేసు ఏమయ్యింది.? చివనరే స్పీకర్ ఏమనుకున్నారో అదే చేశారు.

ఇలాంటి స్థితిలో కోర్టుకెళ్ళి ఎన్నికల సమయంలో పుణ్యకాలం గడిపేయడం మంచిదా? ఇక రెండో ఆలోచన జనంలోకి వెళ్లి కేసీయార్ ప్రభుత్వంపై విమర్శల దాడి చేయడం. ఇలా, అలా అని ప్రచారం చేయాలి. అది ఎటూ బస్సు యాత్ర ద్వారా చేస్తూనే ఉన్నారు. పెద్ద ప్రయోజనం ఉండదేమో? వీటితో ప్రయోజనం లేదు అనుకుంటే, ఏం చేయాలి? జోరుగా ఉన్న కాంగ్రెస్ కాస్త ఆత్మరక్షణలో పడింది. ఇలాంటి స్థితిలో ఈ చర్చను జనంలోకి బలంగా ఎలా తీసుకెళ్లాలి. అధికారపక్షం ఏకంగా 11 మందిని ఈ సెషన్ మొత్తానికి సస్పెండ్ చేసింది… ఇద్దరిని మొత్తం ఈ శాసనసభాకాలనికి సస్పెండ్ చేసింది… ఈ అసాధారణ, కఠిన నిర్ణయాలను కాంగ్రెస్ ఊహించలేదు. ఈ ఉపద్రవం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి.

టీఆర్ ఎస్ తీసుకున్న నిర్ణయానికి గట్టి సమాధానం చెప్పకుంటే కాంగ్రెస్ మరింత దిగజారిపోయే అవకాశం ఉంది. ఇలాంటి స్థితిలో రెండు ప్రత్యామ్నాయాలు వారి ఎదుట ఉన్నాయి. ఒకటి మూకుమ్మడిగా ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించడం. తద్వారా బలమైన సందేశాన్ని జనంలోకి పంపించడం. తిరిగి ఉప ఎన్నికలు వస్తే ప్రమాదమని భావిస్తే, వైసీపీ తరహాలో శాసనసభ సమావేశాలను బహిష్కరించి ఎవ్వరూ సభకు హాజరుకాకుండా నేరుగా జనంలోకి వెళ్ళడం. ఈ రెండు ప్రత్యామ్నాయలతో టీ. కాంగ్రెస్ ముందుకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మామాట : ఉన్న ప్రాణానికి ఊపట్లు తెచ్చుకున్నా కాంగ్రెస్

English summary :

T.Congress made self a goal in Telangana assembly, now it is trying to overcome the situation with a right step. there is only two options before them one is all MLAs resignation, second one is boycotting the assembly session like YCP in Andhra Pradesh

(Visited 15 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: