మోడీ ప్రభుత్వంపై పరకాల విమర్శలు… సమాధానమిచ్చిన నిర్మలా…

How Finance Minister Reacted To Husbands Critique On Economy, And Advice
Share Icons:

ఢిల్లీ: దేశం ఆర్ధిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఏమి పట్టనట్లుగా ఉందని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త, ప్రముఖ రాజకీయ విశ్లేషుకుడు పరకాల ప్రభాకర్ విమర్శించిన విషయం తెలిసిందే. హిందూ పేపర్‌కు రాసిన ఒక ఆర్టికల్‌లో ఆయన దేశంలో ఆర్ధిక వ్యవస్థ గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం తన కొత్త విధానాలను రూపొందించడానికి సుముఖత చూపడంలేదని పరకాల ప్రభాకర్ విమర్శించారు. ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్నా కూడా ప్రభుత్వం ఇంకా తిరస్కరణ ధోరణిలోనే వెళ్తోందన్నారు. వాస్తవాలను కేంద్ర ప్రభుత్వం అంగీకరించడం లేదని పేర్కొన్నారు.

అలాగే బీజేపీ ప్రభుత్వం దేశంలోని వాస్తవిక పరిస్థితులను అంగీకరించడం లేదని, ఇదే అసలు సమస్యకు కారణమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అనుసరిస్తోన్న విధానాలనే మరి కొన్నాళ్ల పాటు కొనసాగిస్తే.. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోవడం ఖాయమంటూ పరకాల ప్రభాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థికంగా దేశం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోందని ధ్వజమెత్తారు. దీనికి ప్రధాన కారణం కేంద్రం అమలు చేసిన విధానాలే కారణమంటూ ఆయన ధ్వజమెత్తారు.

ఇలాంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ.. మాజీ ప్రధానమంత్రులు పీవీ నరసింహా రావు, డాక్టర్ మన్మోహన్ సింగ్ లను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందని పరకాల ప్రభాకర్ చురకలు అంటించారు. ఇప్పటికైనా కళ్లు తెరచుకోకపోతే ఆర్థిక రంగం మరింత సంక్షోభంలో కూరుకుపోతుందని హెచ్చరించారు. దేశ తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఆర్థిక విధానాలను పార్టీ అగ్ర నాయకత్వం విమర్శించడంలో అర్థమే లేదని తేల్చి పారేశారు. ఆర్థిక వ్యవస్థ ఇంతటి దారుణ స్థితుల్లో ఉన్నప్పటికీ.. దీన్ని అంగీకరించడానికి బీజేపీ అధిష్ఠానానికి మనసు ఒప్పట్లేదని అన్నారు.

45 సంవత్సరాల తరువాత ఆర్థిక మాంద్యం వల్ల నిరుద్యోగం భయానక స్థాయికి చేరుకుందని, ఆటోమొబైల్ రంగంలో వందలాది మంది ఉద్యోగాలు కోల్పోతుండటమే దీనికి నిదర్శనమని అన్నారు. అయితే పరకాల వ్యాఖ్యలకు మంత్రి నిర్మలా సీతారామన్ పరోక్షంగా సమాధానమిచ్చారు. 2014 నుంచి 2019 వరకు మౌలిక సంస్కరణల్ని చేపట్టింది మోడీ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. అలాగే జీఎస్టీ, ఆధార్‌, వంట గ్యాస్‌ పంపిణీ వంటి చర్యల్నీ చేపట్టింది కూడా మోడీ ప్రభుత్వమేనని తెలిపారు.

 

 

Leave a Reply