రవిని వెదవన్న పున్నూ….టాస్క్ లో ఇంటి సభ్యుల ఓవర్ యాక్షన్..

house mates over action in big boss new task
Share Icons:

హైదరాబాద్: బిగ్ బాస్ షో లో రసవత్తరమైన గేమ్ 10వ వారంలో మొదలైంది. సోమవారం ఎపిసోడ్ లో ఎలిమినేషన్ ప్రక్రియ జరిగిన విషయం తెలిసిందే. అయితే దాని గురించి మంగళవారం ఎపిసోడ్ లో ఇంటి సభ్యుల మధ్య పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. మొదట నామినేషన్ ప్రక్రియలో పునర్నవి తనకు బాష రాదని విమర్శించడం బాగోలేదని బాబా భాస్కర్, వరుణ్ తో చెప్పాడు.  తనపై ఆరోపణలు చేస్తుంటే క్లారిటీ ఇవ్వాలని అనిపించలేదని అందుకే వదిలేశా అన్నారు బాబా భాస్కర్.

ఇక పునర్నవి సైతం రాహుల్‌లో ఇదే నామినేషన్స్‌పై చర్చ మొదలుపెట్టారు. వరుణ్ కూడా తోడు కావడంతో సీన్‌లోకి ఎంటర్ అయిన వితికా.. రవితో నామినేషన్స్ సందర్భంగా తనపై ఆరోపణలు చేయడం పట్ల మండిపడింది. ‘నువ్ రవితో మాట్లాడావా? అని వరుణ్ వితికాని అడుగగా…మధ్యలో పున్నూ కల్పించుకుని రవిగాడు వెధవ.. ఆ వెధవతో ఎందుకు మాట్లాడాలి.. వాడితో సొల్లు డిస్కషన్ ఎందుకు అంటూ తెగ రెచ్చిపోయింది.

మరోవైపు శ్రీముఖి, బాబా భాస్కర్‌ల మధ్య నామినేషన్స్‌పై సీరియస్ డిస్కషన్ జరిగింది. ఈ చర్చల రచ్చ తర్వాత కెప్టెన్ ప‌దవి పొందేందుకు ఆస‌క్తిక‌ర‌మైన టాస్క్ ఇచ్చారు. అత్త రాజ్యంలో కోడ‌ళ్ళ పాట్లు అనే టాస్క్‌లో భాగంగా శివ‌జ్యోతికి ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడ‌ళ్ళు ఉంటారు. కొడుకులుగా వ‌రుణ్‌, రాహుల్, ర‌వికృష్ణ ఉండ‌గా వారి భార్య‌లుగా వితికా, పున‌ర్న‌వి, శ్రీముఖి ఉన్నారు. బాబా భాస్క‌ర్ శివ‌జ్యోతి మేనేజ‌ర్‌గా, మ‌హేష్ అసిస్టెంట్‌గా ఉంటార‌ని బిగ్ బిస్ తెలిపారు. టాస్క్‌లో భాగంగా బ్రిక్ షాప్‌లో ఉన్న ఇటుక‌ల‌తో కొడుకు, కోడ‌లు క‌లిసి గోడ క‌ట్ట‌వ‌ల‌సి ఉంటుంది.

గోడ క‌ట్టేందుకు శివ‌జ్యోతిని మెప్పించి, త‌న‌కు కావ‌ల‌సిన ప‌నులు చేసి ఆమె ద‌గ్గ‌ర ఉన్న ఇటుక‌లు తీసుకొని గోడ క‌ట్టాల్సి ఉంటుంది. ఎవ‌రైతే పెద్ద గోడ క‌డ‌తారో ఆ జంట కెప్టెన్ టాస్క్‌లో ఉంటార‌ని బిగ్ బాస్ ఆదేశించారు. అలాగే శివజ్యోతి దగ్గర ఓ వీలునామా ఉంటుందని దాన్ని ఇంటి సభ్యులు దొంగిలించ వచ్చని చెప్పారు. అది కూడా చివరికి ఎవరి దగ్గర ఉంటుందో వారు కెప్టెన్ టాస్క్ లో ఉంటారని అన్నారు. దీంతో రంగంలోకి దిగిన ఇంటి స‌భ్యులు ఎవరి పర్ఫార్మన్స్ వారు చేస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కొడుకులుగా ర‌వి, రాహుల్‌, వ‌రుణ్‌లు కాస్త సైలెంట్‌గా ఉన్న‌ప్ప‌టికి కోడ‌ళ్ళు మాత్రం ఓవర్ యాక్షన్ చేస్తూ అత్త‌ కాళ్లు మీద ప‌డి మ‌రి ఆమె ద‌గ్గ‌ర మంచి మార్కులు కొట్టేందుకు ప్ర‌య‌త్నించారు. అటు బాబా భాస్కర్, మహేశ్ లు కూడా తమకు తగ్గటుగా నటించారు. ఈ టాస్క్ బుధవారం ఎపిసోడ్ లో కూడా కొనసాగనుంది.

 

 

Leave a Reply