హాట్ డ్యాన్సులతో అదరగొట్టిన అలీ, అషు

hot dance show in big boss house
Share Icons:

హైదరాబాద్:

 

బిగ్ బాస్ బుధవారం ఎపిసోడ్ బాగా హాట్ గా సాగింది. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో భాగంగా హౌస్ మేట్స్ అదిరిపోయే ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఇక జడ్జిలుగా బాబా భాస్కర్, శ్రీముఖిలు వారి ప్రదర్శనలని జడ్జి చేసి కామెంట్లు ఇచ్చారు. అలాగే వీరిలో బెస్ట్ పర్ఫార్మన్స్ ఇచ్చిన నలుగురు సభ్యులకి యాప్పీ ఫీజ్ డ్రింక్ ఇచ్చారు. వారు మళ్ళీ  ఫైనల్లో తలపడనున్నారు. టాస్క్ లో భాగంగా పునర్నవి మాస్ స్టెప్పులతో బిగ్ బాస్ హౌస్‌ను ఊపేసింది. ‘పిల‌గా ఇర‌గ ఇర‌గ’ సాంగ్‌కి అదిరిపోయే డాన్స్‌తో ఇర‌గదీసింది.

 

ఆ తర్వాత అషు హాట్ డ్యాన్స్ తో అదరగొట్టేసింది. జిల్ జిల్ జిల్ జిగేలురాజా సాంగ్‌కి అదిరిపోయేలా డాన్స్ చేసింది. ఆమె డాన్స్‌కి జ‌డ్జ్ శ్రీముఖీతో పాటూ బాబా కూడా షాక్ అయ్యాడు. ఆమె డ్యాన్స్ కు మెచ్చి డ్రింక్ కూడా ఇచ్చారు. అలాగే వితిక కళ్ళు లేని అమ్మాయిగా మంచి స్కిట్ చేయగా, శివజ్యోతి ఏదో మ్యాజిక్ చేస్తానని చెప్పి కామెడీ చేసింది. అలాగే హిమజ కూడా ఓ చ‌క్క‌నోడా సాంగ్ సాంగ్‌ని త‌ప్పు త‌ప్పుగా పాడుతూ.. ఆగి ఆగి పాడుతూ.. అంతా న‌వ్వుతుంటే ఆగండి ఇంకా ఉంద‌ని మ‌ధ్య‌లో మాట్లాడుతూ పాట‌పాడింది.

 

రాహుల్ ఏమైపోయావే సాంగ్ మొద‌లు పెట్టి.. రెండు సార్లు ఆగిపోయాడు. నేను పాడ‌లేను గివ్ అప్ అన‌డంతో అంతా ఎంక్రేజ్ చేశారు. దీంతో మళ్ళీ పాడతానని చెప్పాడు. ఇక మహేశ్ తన బిగ్ బాస్ జర్నీని స్కిట్ రూపంలో చేశాడు. అలాగే రవి లేడీ, జెంట్ గెటప్ వేసిన్ బ్లాక్ బస్టర్ సాంగ్ కి డ్యాన్స్ వేశాడు. మళ్ళీ రాహుల్ వచ్చి సాంగ్ పాడి అందరినీ మెప్పించాడు. శ్రీముఖి డ్రింక్ కూడా ఇచ్చారు.

 

అలీ స్వింగ్‌జ‌రా పాట‌తో సిక్స్ ప్యాక్ చూపిస్తూ స్టెప్స్ వేసి పిచ్చెక్కించాడు. అలీ డాన్స్‌కి ఫిదా అయిన శ్రీముఖీ ఆపిల్‌పీజ్ బాటిల్స్ అన్నీ అందిస్తూ పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తింది. వ‌రుణ్ సందేష్ ఉండిపోరాదే అంటూ సాంగ్ పాడి డ్రింక్ గెలుచుకున్నారు. మొత్తం మీద అషు, రాహుల్, వరుణ్, అలీ లు డ్రింక్స్ గెలుచుకుని ఫైనల్లో తలపడనున్నారు.

 

Leave a Reply