TRENDING NOW

ఉలవలు తింటున్నారా..?

ఉలవలు తింటున్నారా..?

 తిరుపతి, అక్టోబర్ 18,

గుర్రాలకు పెట్టేవారట ఆ కాలంలో ఉలవలు. అంటే అవి తినడం వలన ఎంత శక్తి వస్తుందో ఆలోచించారా. తెలుగు వారికీ ఉందండీ ఉలవచారు… కానీ నేడు మనలో చాలామందికి ఈ డిష్ అంటే ఏమిటో తెలియదు. అదే కాదు చాలా వరకు సంప్రదాయ వంటలు మరచిపోయాం కదూ. నిజానికి మన పూర్వీకులు ఉలవలతో గంజి, గుగ్గిళ్లు, ఉలవచారు వంటివి తయారుచేసి తీసుకునేవారు. అందుకే వారు అప్పటి నుండి ఇప్పటి వరకు ఎలాంటి అనారోగ్య సమస్యలతో బాధపడకుండా ఆరోగ్యంగా ఉన్నారు.

Life Homepathy
treefurn AD
GCR Infra AD, Maamaata, SEO, Primepagesinfo,

ఉలవలలోని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే కచ్చితంగా వీటిని తీసుకోవాలనిపిస్తుంది. అవేంటో చూద్దాం.. ఉలవల్లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలు, దంతాలు  బలంగా ఉంచడానికి ఉపకరిస్తుంది. అలాగే మహిళలకు ఉలవలు దివ్యౌషధంగా పనిచేస్తాయి. ఎందుకంటే చాలామంది మహిళలకు ఋత సమయంలో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ ఉలవలను బాగా వేయించి పొడి చేసి అందులో కొద్దిగా ఉప్పు, నీళ్లు కలిపి తాగాలి. ఇలా చేస్తే ఆ నొప్పుల నుండి వెంటనే ఉపశమనం లభిస్తుంది. దాంతో కండరాలు పటిష్టంగా మారుతాయి.

కాలేయంలోని విష, వ్యర్థ పదార్థాలను బయటకు పంపడానికి ఉలవలు దోహదపడుతాయి. ఉలవలను నిత్యం గంజి, గుగిళ్లు రూపంలో తీసుకుంటే మధుమేహ వ్యాధి అదుపులో ఉంటుంది. అంతే కాదు ఉలవలు ఆహారంలో తీసుకోవడం ద్వారా అధిక బరువు తగ్గుతారు. ముఖ్యంగా జీర్ణ సమస్యలతో   బాధపడేవారు ఉలవల పొడిని అన్నంలో కలిపి తీసుకుంటే అల్సర్, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు తొలగిపోతాయి.

ఇన్ని రకాల ప్రయోజనాలున్న మన ఉలవలు ఇపుడు అన్ని సూపర్ మార్కెట్లలోనూ లభిస్తున్నాయి. నిత్యం అన్నం తినడం కాస్త మాని, వరైటీ కోసం.. ఉలవలతో సుండల్ తినిచూడండి.. ఆరోగ్యానికి ఆరోగ్యం… శక్తికి శక్తీ లభిస్తుంది.

మామాట: సంప్రదాయ వంటలు ఇపుడు గ్రామాల్లోనే తినడం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: