హోండా నుంచి వస్తున్న సీబీ షైన్….

Share Icons:

ముంబై, 28 మే:

హోండా మోటార్స్ సైకిల్స్‌ అండ్‌ స్కూటర్స్‌ ఇండియా ఓ సరికొత్త లిమిటెడ్‌ ఎడిషన్‌ వాహనాన్ని మార్కెట్లోకి విడుదల చేసింది.  125 సీసీ సామర్థ్యంతో కూడిన హోండా సీబీ షైన్‌ మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ వాహనం డ్యూయల్‌ టోన్‌ రంగుల్లో లభిస్తుంది. దీని ధర రూ.59,083గా నిర్ణయించారు.

దీనిలో సరికొత్త గ్రాఫిక్‌ డిజైన్‌, సరికొత్త ఫ్యూయల్‌ ట్యాంక్‌ను అమర్చారు. అదనంగా న్యూ విజర్ గ్రాఫిక్ డిజైన్ సైడ్‌ ప్యానల్స్‌, రియర్‌ కౌల్‌ను కూడా మార్చారు. పాత షైన్‌లో ఉన్న ఇంజిన్‌నే దీనిలో కూడా కొనసాగించారు. 

అలాగే ఫోర్ స్ట్రోక్, ఎయిర్ కూల్డ్, 5500 ఆర్పీఎం వద్ద 10.3 ఎన్ఎం పీక్ టార్చి, 7500 ఆర్పీఎం వద్ద 10.16 బీహెచ్పీ సామర్థ్యం దీని సొంతం. 4- స్పీడ్ గేర్ బాక్స్ ఇంజిన్ కలిగి ఉన్న హోండా సీబీషైన్.. కాంబీ బ్రేక్ సిస్టమ్‌తో డ్రమ్ అండ్ డిస్క్ బ్రేక్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ప్రతియేటా తొమ్మిది లక్షలకు పైగా సీబీ షైన్ బైక్ లు అమ్ముడు పోతున్నాయి.  

మామాట: బడ్జెట్ ధరలో మంచి బైక్..

Leave a Reply