హోండా యాక్టివా 5జీ మోడల్ స్కూటర్ విడుదల

Share Icons:

ఢిల్లీ, 29 మే:

దేశీయ దిగ్గజ ద్విచక్రవాహన తయారీదారు హోండా తన స్కూటర్‌ విభాగం నుంచి యాక్టివా 5జీ మోడల్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఇది కూడా 10 ప్రీమియం పెరల్ ప్రీసిస్ వైట్, స్ట్రోనియం సిల్వల్ మెటాలిక్ విత్ పెరల్ ఇగ్నియస్ బ్లాక్‌తో డ్యూయల్‌ టోన్‌ కలర్స్‌లో లభిస్తుంది. దీనిలో సరికొత్త గ్రాఫిక్స్‌, బ్లాక్‌ రిమ్స్‌, క్రోమ్‌ మఫ్లర్‌ కవర్‌, పూర్తి నలుపు రంగు ఇంజిన్‌ లభిస్తుంది.

దీని ధర రూ.55,032గా నిర్ణయించారు. ఇంజిన్‌లో ఎటువంటి మార్పులు చేయలేదు. న్యూ స్టైలిష్ గ్రాఫిక్స్, బ్లాక్ రిమ్స్, క్రోమ్ మఫ్లర్ కవర్ తదితర ఫీచర్లు జత కలిపారు.

ఇక వచ్చే ఏడాది బీఎస్ -6 ప్రమాణాలతో హోండా యాక్టీవా 6జీ మోడల్ స్కూటర్ విపణిలోకి రానున్నది. ప్రస్తుతం యాక్టీవా 5జీ మోడల్ స్కూటర్లు ఏటా 30 లక్షలకు పైగా అమ్ముడు పోతున్నాయి.

మామాట: మద్యతరగతి వాళ్ళకి మంచి బైక్..

Leave a Reply