హోమో సెక్స్ పై వెనక్కువెళ్లడానికి లేదు

Share Icons:

తిరుపతి, సెప్టెంబర్ 10,

అవును మీరు చదివింది నిజమే. ఇటీవలే ఐపిసీ సెక్సన్ 377ను రద్దు చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనం చాలా దూరదృష్టితో వ్యవహరించింది. మళ్లీ భవిష్యత్తులో హోమోసెక్స్ నేరంగా పరిగనింపబడే ప్రమాదం లేకుండా చట్టంలో గట్టి నిర్మాణం చేసింది. సెక్సన్ 377 కేసు విచారించిన సుప్రీం ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా సారథ్యంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం “Doctrine of Progressive Realisation of Rights” అనే న్యాయసూత్రాన్ని ఆధారం చేసుకుని భవిష్యత్తులో 377 పై మార్పులుచేపట్టకుండా చేశారు.

భవిష్యత్తులో LGBTQ సమూహం తిరిగి నేరగాళ్లుగా గుర్తింపబడకుండా జాగ్రత్త తీసుకుంది. ఈ న్యాయసూత్రం మేరకు ఒక సారి ఒక అంశంలో ప్రజలకు హక్కు కల్పిస్తే, దిరిగి దానిని రద్దు చేసే అధికారం రాజ్యానికి (ప్రభుత్వానికి) ఉండదని తాజా తీర్పులో పోర్కొన్నారు. ఒకసారి ముందుకు పడిన అడుగు మరి వెనక్కు మరలడానికి లేదు.. మడమ తిప్పడం కుదరదని న్యాయస్థానం తెలిపింది. పురోగమిస్తున్న సమాజం మళ్లీ పాత నిబంధనలతో వెనక్కు మళ్లడానకి అవకాశం ఉండకూడదని ప్రధాన న్యాయమూర్తి తీర్పులో అభిప్రాయపడ్డారు.  కనుక.. ఇక భయం లేదు గే స్ కదలండి ముందుకు మునుముందుకు…

మామాట: కాస్త మంచి నిర్ణయాలకు కూడా ఇటువంటి షరతుపెట్టరాదా యువర్ ఆనర్

Leave a Reply