పైల్స్ సమస్యతో భాధపడుతున్నారా..? అయితే ఈ చిట్కాలు మీకోసమే…

home remedies for piles problem
Share Icons:

హైదరాబాద్:

పైల్స్ సమస్య ఉన్నవారు ఉన్న చోట నిలబడలేరు. నిమిషం కూడా కుదురుగా కూర్చోలేరు. అసలు వారు అనుభవించే బాధ గురించి మాటల్లో వర్ణించలేం కూడా. ఇక కాలకృత్యాలు తీర్చుకోవడానికి టాయ్‌లేట్‌కి వెళితే వారు అనుభవించే నరకయాతన ఆ నాలుగు గోడలకే తెలియాలి.

కనీసం ప్రశాంతంగా కూర్చుని భోజనం కూడా చేయలేరు. ఇంత నరకయాతనకి కారణాలు చాలానే ఉన్నాయి. థైరాయిడ్‌, డ‌యాబెటిస్‌, మ‌ల‌బ‌ద్ద‌కంతో బాధపడే వారికీ ఈ పైల్స్ రావొచ్చు.

మరికొందరు ఆహార విషయంలో చూపే అశ్రద్ద నిత్యం మాంసాహారం ఎక్కువగా తినడం, రోడ్లపై దొరికే ఫాస్ట్‌ఫుడ్ ఎక్కువగా తినడం, రోజులో ఎక్కువ సమయం కూర్చోవడం ఇలా రకరకాల కారణాల వల్ల పైల్స్ రావొచ్చు. అయితే వీటిలో ఏ కారణం వల్ల వచ్చినా గానీ నొప్పి మాత్రం భరించలేనంతగా ఉంటుందనేది జగమెరిగిన సత్యం.

ఒక మనిషిని ఇంతలా అతలాకుతలం చేసే పైల్స్‌ని మన వంటింట్లోని కొన్ని వస్తువుల సాయంతో తగ్గించుకోవచ్చు. ఇంతకీ అవేంటో చూద్దామా…

పైల్స్ తగ్గించే వంటింటి చిట్కాలు…

  1. తెల్ల చామంతి పువ్వుని వేడి నీటిలో మరిగించి డికాక్షన్ కాయాలి. ఆ మిశ్రమాన్ని చల్లార్చాక పైల్స్ ఉన్న చోట రాస్తే ఉపశమనం లభిస్తుంది.
  2. బిర్యానీ ఆకుల్ని, రెండు వెల్లుల్లి రెబ్బల్ని నీటిలో వేసి బాగా మరిగించాలి. తర్వాత దానిని చల్లార్చి పైల్స్ ఉన్న ప్రదేశంలో రాయాలి. దీని వల్ల ఆ బాధ తగ్గుతుంది.
  3. యాపిల్ సైడర్ వెనిగర్‌ని ఒక చిన్న గిన్నెలో తీసుకుని దానిలో కాటన్ బాల్స్ వేసి కొద్ది సేపు నానబెట్టాలి. ఆ తర్వాత వాటిని తీసి సమస్య ఉన్న చోట రాస్తే నొప్పి తగ్గుతుంది.
  4. కలబంద గుజ్జుని తీసి దానిని పైల్స్ ఉన్న చోట రాస్తే సమస్య త్వరగా తగ్గుముఖం పడుతుంది.
  5. ఒక నిమ్మకాయ తీసుకుని పూర్తిగా రసం పిండి, ఆ రసంలో కొంచెం తేనె, అల్లం రసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పైల్స్ ఉన్న చోట రాస్తే చాలా వరకూ నొప్పి తగ్గుతుంది.
  6. ఆముదం గానీ, లేదా బాదం నూనె గానీ తీసుకుని అందులో టీ ట్రీ ఆయిల్ కలిపి పైల్స్ ఉన్న ప్రదేశంలో రాయడం వలన సమస్య తగ్గుముఖం పడుతుంది.
  7. ఆలివ్ నూనెలో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు ఎక్కువగా ఉన్న కారణంగా పైల్స్ సమస్యను తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఒక గిన్నెలో కొద్దిగా ఆలివ్ నూనె వేసి అందులో కాటన్ బాల్స్ ముంచి పైల్స్ పైన రాస్తే త్వరగా తగ్గిపోతాయి.

మామాట: షేర్ చేసి పైల్స్ ఉన్న వారికి విముక్తి కలిగించండి…

 

Leave a Reply