అద్భుతమైన ఫీచర్లతో విడుదలైన నోకియా 9 ప్యూర్‌వ్యూ…

hmd global released nokia 9 pureview
Share Icons:

ముంబై:

 

హెచ్‌ఎండీ గ్లోబల్ తన నూతన నోకియా స్మార్ట్‌ఫోన్ నోకియా 9 ప్యూర్‌వ్యూను ఈరోజు భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఇది రూ.49,999 ధరకు వినియోగదారులకు ఈరోజు నుంచి ఆన్‌లైన్‌లో లభిస్తుండగా, ఈ నెల 17వ తేదీ నుంచి ఈ ఫోన్‌ను అన్ని రిటెయిల్ ఔట్‌లెట్లలో విక్రయించనున్నారు. కాగా ఈ ఫోన్‌ను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం క్యాష్‌బ్యాక్ ఇస్తారు. అలాగే పలు ఇతర ఆకట్టుకునే ఆఫర్లను కూడా ఈ ఫోన్‌తో అందిస్తున్నారు.

 

ఈ ఫోన్  వెనుక భాగంలో 5 కెమెరాలు ఉన్నాయి. దీంతో ఈ ఫోన్ సహాయంతో మరింత నాణ్యమైన ఫొటోలు, వీడియోలను తీసుకోవచ్చు. ఈ ఫోన్‌లో ఉన్న డిస్‌ప్లేకు గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు. ఐపీ 67 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్‌ను కూడా ఈ ఫోన్ కలిగి ఉంది. ఈ ఫోన్‌లో ఉన్న 3320 ఎంఏహెచ్ బ్యాటరీకి వైర్‌లెస్ చార్జింగ్ సదుపాయాన్ని అందిస్తున్నారు.

 

నోకియా 9 ప్యూర్‌వ్యూ ఫీచర్లు…

 

5.99 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ పోలెడ్ డిస్‌ప్లే, 2560 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 12 మెగాపిక్సల్ పెంటా రియర్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐపీ 67 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3320 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్, వైర్‌లెస్ చార్జింగ్.

Leave a Reply