తిరుమల లడ్డుకి 306 సంవత్సరాలు చరిత్ర!

Share Icons:
  • 1715 ఆగస్టు 2 నుంచి లడ్డులు ప్రారంభం
  • తిరుపతి లడ్డుకి విశిష్టమైన చరిత్ర
  • పేటెంట్ హక్కులు, ‘జియోగ్రాఫికల్ ఇండికేషన్ స్టేటస్’
  • తిరుపతి వచ్చి లడ్డు లేకుండ వెళ్లరు
  • రుచిలోనూ సాటిలేని తిరుమల లడ్డు

తిరుమలశ్రీవారిలడ్డూకు ఇప్పటికి కి సరిగ్గా 306 సంవత్సరాలు …. 1715 ఆగస్టు 2 నుంచి తిరుపతి లో లడ్డు పంపిణి ప్రారంభం అయింది. నాటి నుంచి నేటి వరకు రుచిలో తిరుగులేదు . తిరుపతి లాడ్డుకి పేటెంట్ హక్కులు కలిగి ఉండటం మరో విశిష్టత . దేశ విదేశాలనుంచి వచ్చే భక్తులు లడ్డులు లేకుండా తిరిగి వెళ్లటం జరగదు.

చక్కెర, శనగపిండి, నెయ్యి, ఆయిల్, యాలకులు, జీడిపప్పు, డ్రై ఫ్రూట్స్‌తో చేసే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం అంటే ఇష్టపడని భక్తులు ఉండరంటే అతిశయోక్తి కాదు. రకరకాలైన ప్రసాదాలను టీటీడీ అందుబాటులో ఉంచినప్పటికీ భక్తులకు లడ్డూ అంటేనే అత్యంత ప్రీతిపాత్రంగా ఉంటుంది. ప్రసాదాల విక్రయం ద్వారా టీటీడీకి ఏటా కోట్ల ఆదాయం సమకూరుతోంది. శ్రీవారి ప్రసాదంగా లడ్డూను ఇవ్వడం 1715 ఆగస్టులో ప్రారంభమైంది.

మూడు లక్షలకు పైగా లడ్డూలు తయారు చేయగల సామర్థ్యం టీటీడీ సొంతం. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులకు మరింత ఎక్కువగా లడ్డూలను అందుబాటులో ఉంచుతారు.  తిరుపతి లడ్డూకు పేటేంట్, ట్రేడ్ మార్క్ కూడా ఉండటం విశేషం, అంతేకాదు జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ కార్యాలయం రిజిస్ట్రార్ 2014వ సంవత్సరంలో ‘జియోగ్రాఫికల్ ఇండికేషన్ స్టేటస్’  ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.

-కె. రాంనారాయణ, సీనియర్ జర్నలిస్ట్.

Leave a Reply