TRENDING NOW

సిద్ధూ తల నరికి తీసుకొచ్చిన వారికి కోటి రూపాయలు…

సిద్ధూ తల నరికి తీసుకొచ్చిన వారికి కోటి రూపాయలు…

ఆగ్రా, 6 డిసెంబర్:

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పై పంజాబ్ మంత్రి, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ అవాకులు, చెవాకులు పేలారని, ఆయన తలను నరికి తీసుకొచ్చిన వారికి కోటి రూపాయలను నజరానాగా ఇస్తామని హిందూ యువవాహిని తెలిపింది. 

ఈ మేరకు హిందూ యువవాహిని ఆగ్రా విభాగం అధ్యక్షుడు తరుణ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ… సిద్ధూ ఆగ్రాకు వస్తే తల నరికేస్తామని హెచ్చరించారు. అసలు ఆయన పాకిస్థాన్‌కు అనుకూలంగా, ప్రతిసారి మాట్లాడుతున్నారని… ఆయనకు భారత్‌లో ఉండే అర్హత కూడా లేదని అన్నారు. సిద్ధూను తామే పాకిస్థాన్‌కు పంపించేస్తామని చెప్పారు.

కాగా, ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజస్థాన్‌లో జరిగిన ర్యాలీలో సిద్ధూ ప్రసంగిస్తూ, మోదీ ఒక దొంగ అని, యోగి ఒక భోగి అని అన్నారు. బీజేపీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని చెప్పారు. చౌకీదారు కుక్క కూడా విశ్వాసాన్ని కోల్పోయిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

మామాట: రాజకీయాల్లో మితిమీరుతున్న విమర్శలు..

(Visited 11 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: